De Villiers: ఐపీఎల్ రిటర్న్ కన్ఫామ్ చేసిన డివిలియర్స్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)కు డివిలియర్స్ తిరిగొస్తున్నాడనే వార్తలను డివిలియర్స్ కన్ఫామ్ చేసేశాడు. ఇప్పటివరకూ ఒక్క టైటిల్ కూడా గెలుచుకోలేకపోయిన జట్టుకు ఇది సూపర్ గుడ్ న్యూస్ అని చెప్పాలి.

De Villiers: ఐపీఎల్ రిటర్న్ కన్ఫామ్ చేసిన డివిలియర్స్

Ab De Villiers Confirms Return To Rcb In Ipl 2023, Says ‘glad Virat Kohli Said It' (2)

Updated On : May 24, 2022 / 8:23 PM IST

 

 

De Villiers: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)కు డివిలియర్స్ తిరిగొస్తున్నాడనే వార్తలను డివిలియర్స్ కన్ఫామ్ చేసేశాడు. ఇప్పటివరకూ ఒక్క టైటిల్ కూడా గెలుచుకోలేకపోయిన జట్టుకు ఇది సూపర్ గుడ్ న్యూస్ అని చెప్పాలి. గతంలో లేనంతగా సక్సెస్ ఫుల్ గా ప్రస్తుత సీజన్ కొనసాగుతున్న సమయంలో డివిలియర్స్ నిర్ణయం జట్టులో మరింత జోష్ నింపింది.

గతేడాది ప్రొఫెషనల్ క్రికెట్ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించిన డివిలియర్స్‌.. IPL కెరీర్‌ను ఢిల్లీ డేర్‌డెవిల్స్ (ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్)తో ప్రారంభించి మూడు సీజన్‌లను గడిపాడు.

రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు 2011లో డివిలియర్స్‌ని రిక్రూట్ చేసుకుంది. బెంగుళూరు ఫ్రాంచైజీ అత్యుత్తమ ఆటగాళ్ళలో ఒకడిగా నిలిచాడు. RCBతో 11 సీజన్లు ఆడి 156 IPL మ్యాచ్‌లలో కనిపించాడు. రెండు సెంచరీలు, 37 హాఫ్ సెంచరీలతో సహా 4వేల 491 పరుగులు చేశాడు.

Read Also: డివిలియర్స్ రిటర్న్స్.. క్లూ ఇచ్చిన కోహ్లీ

విరాట్ కోహ్లి, అతని మాజీ RCB సహచరుడు వచ్చే ఏడాది IPLకి తిరిగి వస్తాడని ప్రకటించిన కొద్ది రోజులకే డివిలియర్స్ ప్రకటన వెలువడింది.

“విరాట్ దానిని ధ్రువీకరించినందుకు సంతోషిస్తున్నా” వాస్తవికంగా చెప్పాలంటే, ఇంకా దీనిపై పూర్తి క్లారిటీ రాలేదు. నిస్సందేహంగా వచ్చే ఏడాది ఐపీఎల్‌కు హాజరవుతా. ఏ స్థానంలో పనిచేస్తానో ఖచ్చితంగా తెలియదు, కానీ తిరిగి రావడానికి ఎదురు చూస్తున్నా” అని డివిలియర్స్ మీడియాతో మాట్లాడుతూ అన్నారు.

“బెంగుళూరులో కొన్ని మ్యాచ్‌ల గురించి విన్నాను. తిరిగి రావడమంటే ఇష్టంగా ఉంది. దాని కోసం ఎదురు చూస్తున్నాను.” అని వివరించాడు డివిలియర్స్.

డివిలియర్స్ తన IPL కెరీర్‌లో చివరి మ్యాచ్ RCBజట్టుకే ప్రాతినిధ్యం వహించాడు. 156 గేమ్‌లలో, అతను 41.20 సగటుతో 4వేల 491 పరుగులు చేశాడు. 170 ఇన్నింగ్స్‌లలో 5వేల 162 IPL పరుగులు చేశాడు. 3 సెంచరీలు. 40 హాఫ్ సెంచరీలతో, అతని అత్యధిక స్కోరు 133గా ఉంది.