టీవీ పరిశ్రమలో కరోనా కలకలం.. మళ్లీ షూటింగ్స్ బంద్!

  • Published By: srihari ,Published On : June 24, 2020 / 09:10 AM IST
టీవీ పరిశ్రమలో కరోనా కలకలం.. మళ్లీ షూటింగ్స్ బంద్!

Updated On : June 24, 2020 / 9:10 AM IST

టీవీ పరిశ్రమలో కరోనా కలకలం సృష్టించింది. లాక్ డౌన్ అనంతరం ప్రారంభమైన సీరియల్స్ షూటింగ్స్‌కు మళ్లీ బ్రేక్ పడింది. టీవీ సీరియల్స్ షూటింగ్స్ బంద్ అయ్యాయి.

ఇటీవల షూటింగ్ సమయంలో సీరియల్ యూనిట్ మెంబర్ కు కరోనా వైరస్ సోకింది. మరికొందరికి వైరస్ లక్షణాలు బయటపడ్డాయి. దాంతో వెంటనే టీవీ సీరియల్స్ ఆపేసిన నిర్మాతలు.. ఫెడరేషన్ కార్యాలయంలో సమావేశమయ్యారు. 

కరోనా విజృంభిస్తుండటంతో షూటింగ్స్ జరపాలా? వద్దా? అనేదానిపై నిర్ణయం తీసుకోనున్నారు. భవిష్యత్ కార్యాచరణపై కూడా యూనిట్ మెంబర్లతా చర్చలు జరుపుతున్నారు. కొన్ని రోజుల క్రితం తిరుపతి నుంచి వచ్చిన ఆర్టిస్ట్‌కు కరోనా పాజిటివ్ వచ్చిందని టీవీ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అధ్యక్షుడు ప్రసాదరావు తెలిపారు.

అతను పనిచేస్తున్న రెండు సీరియళ్లను ఆపేసినట్టు ఆయన చెప్పారు. ఈ రోజు 4, 5 సీరియళ్ల షూటింగ్స్ మాత్రమే జరుగుతున్నాయని అన్నారు.