Aha Dance Ikon : ఆహా డ్యాన్స్ ఐకాన్ షో విన్నర్ ఎవరో తెలుసా..? ఎంత ప్రైజ్ మనీ గెలుచుకున్నాడో తెలుసా..??

తెలుగులో ఆహా ఓటీటీ దూసుకుపోతుంది. వరుసగా కొత్త సినిమాలు, సిరీస్ లతో పాటు కొత్త కొత్త షోలు కూడా మొదలుపెడుతూ ప్రేక్షకులని ఎంటర్టైన్ చేస్తుంది. కొన్ని రోజుల క్రితం ‘తెలుగు ఇండియన్ ఐడల్’ సింగింగ్ రియాలిటీ షోని గ్రాండ్ గా సక్సెస్ చేసింది. ఇటీవల డ్యాన్స్ ఐకాన్ అంటూ.............

Aha Dance Ikon : ఆహా డ్యాన్స్ ఐకాన్ షో విన్నర్ ఎవరో తెలుసా..? ఎంత ప్రైజ్ మనీ గెలుచుకున్నాడో తెలుసా..??

Aha Dance Ikon show firs season winners are raju and asif

Updated On : November 29, 2022 / 7:18 AM IST

Aha Dance Ikon :  తెలుగులో ఆహా ఓటీటీ దూసుకుపోతుంది. వరుసగా కొత్త సినిమాలు, సిరీస్ లతో పాటు కొత్త కొత్త షోలు కూడా మొదలుపెడుతూ ప్రేక్షకులని ఎంటర్టైన్ చేస్తుంది. కొన్ని రోజుల క్రితం ‘తెలుగు ఇండియన్ ఐడల్’ సింగింగ్ రియాలిటీ షోని గ్రాండ్ గా సక్సెస్ చేసింది. ఇటీవల డ్యాన్స్ ఐకాన్ అంటూ సరికొత్త డ్యాన్స్ షోతో వచ్చి మెప్పించింది ఆహా. 13 వారాల పాటు సాగిన ఈ షో తాజాగా ఫైనల్ ఎపిసోడ్ అయిపొయింది.

రమ్యకృష్ణ, శేఖర్ మాస్టర్ జడ్జీలుగా, మోనాల్ గజ్జర్, శ్రీముఖి, యాష్ మాస్టర్ మెంటార్స్ గా, ఓంకార్ యాంకర్ గా ఈ షో ఆడియన్స్‌ను బాగా అలరించింది. డాన్స్ ఐకాన్ ఫ‌స్ట్ సీజన్‌ విన్నర్స్‌గా కంటెస్టెంట్ అసిఫ్‌, కొరియోగ్రాఫర్ గా రాజు నిలిచారు. రకరకాల స్టైల్స్ తో మొదటి నుంచి అద్భుతమైన ప్రదర్శనలు ఇచ్చి ఆసిఫ్, రాజు షో విన్నర్ అయ్యారు.

Allu Arjun : అత్తారింటికి అల్లుఅర్జున్.. చుట్టుపక్కల గ్రామాల నుంచి భారీగా జనం..

ఈ షోలో విజేత‌గా నిలిచిన వీరికి విన్నర్ ట్రోఫీతో పాటు, 20 ల‌క్ష‌ల రూపాయ‌ల న‌గ‌దు బహుమతి కూడా లభించింది. ఇక రాజు అయితే టాలీవుడ్‌కి చెందిన స్టార్ హీరోకి కొరియోగ్ర‌ఫీ చేసే అవ‌కాశాన్ని దక్కించుకున్నాడు. దీంతో పలువురు వీరికి అభినందనలు తెలుపుతున్నారు.