aligarh girl rape : ఇల్లు జైలులా ఉంది..స్వేచ్ఛ కావాలంటూ బయకెళ్లిన ఆడపిల్ల…మృగాడి చేతిలో బలైన ఘటన

aligarh girl rape : ఇల్లు జైలులా ఉంది..స్వేచ్ఛ కావాలంటూ బయకెళ్లిన ఆడపిల్ల…మృగాడి చేతిలో బలైన ఘటన

Aligarh Girl Rape

Updated On : March 16, 2021 / 12:43 PM IST

aligarh girl rape :  ఆడపిల్లలు బైటకెళితే..ఎవరో ఒకరిని తోడు ఇచ్చి పంపుతుంటాం. ఎందుకంటే బైటకెళ్లిన ఆడపిల్లు క్షేమంగా ఇంటికి తిరిగి వస్తుందో రాదో తెలియని పరిస్థితుల్లో ఉన్నాం. ఆడపిల్లలపై జరిగే అఘాయిత్యాలు..అత్యాచారాలు ప్రతీరోజు వింటూనే ఉన్నాం. దీంతో ఆడపిల్లను కనాలంటేనే భయపడిపోతున్నా రోజులు. ఆడపిల్లను బైటకు పంపించాలంటే ఆ తల్లిదండ్రుల భయం అంతా ఇంతా కాదు.

అందుకే ‘‘అసలే రోజులు బాగాలేవు.. ఒంటరిగా బయటకు వెళ్లకూడదు.. స్నేహితులు, షికార్లు అంటూ బయట తిరగడం మంచిది కాదు.. స్నేహితులే కదాని పూర్తిగా నమ్మటం కూడా మంచిది కాదు. ఎవర్ని నమ్మేలా లేవు రోజులు’’ అంటూ తల్లిదండ్రులు ఆడపిల్లలకు చెబుతుంటారు. వారి భయం వారిది..తమ బిడ్డకు ఏం జరుగుతుందోననే భయం వెన్నాడుతుంటుంది. అది అమ్మాయిలు అర్థం చేసుకోవాలి..అలాకాకుండా ప్రతీ దానికి ఆంక్షలు పెడుతున్నారు. కాలు బైటపెట్టనివ్వటం లేదని అమ్మానాన్నలమీద పెద్దవారిమీద అలిగేతే..ఇల్లు జైలులా ఉంది..నాకు స్వేచ్ఛ కావాలని పెద్దల ఆందోళనని ఆంక్షలుగా భావిస్తే ఇదిగో..ఈ అమ్మాయికి జరిగిందే జరగొచ్చు..చెప్పలేం..

అలా ఇల్లు జైలులా ఉంది నాకు స్వేచ్ఛ కావాలని బైటకెళ్లిన ఓ అమ్మాయి మృగాడికి బలైపోయింది. దారుణ అత్యాచారానికి గురైంది. స్వేచ్ఛగా తనకు నచ్చినట్లు జీవించాలని ఆశించి..అర్థరాత్రి అందరూ నిద్రపోతుండగా..నెమ్మదిగా చప్పుడు లేకుండా ఇంటినుంచి కాలు బైటపెట్టిందో అమ్మాయి. తనపై పెట్టిన ఆంక్షలు తన క్షేమం కోసమేనని తెలుసుకోలేకపోయింది. అలా ఇంటినుంచి బైటకొచ్చిన ఓ యువతి మృగాడి చేతికి చిక్కి.. అత్యాచారానికి గురయ్యింది. బాధితురాలిని కాపాడటం కోసం వచ్చిన ఆమె బంధువుపై నిందితుడు కత్తితో దాడి చేసిన ఘటన నేరాలకు అడ్డాగా మారిన ఉత్తరప్రదేశ్ లో జరిగింది.

అలీగఢ్‌కు చెందిన ఓ యువతి ఇంట్లో తనకు ఫ్రీడం లేదని భావించింది. నాలుగు రోజుల క్రితం అర్ధరాత్రి ఇంటి నుంచి బయటకు వచ్చింది. అర్థరాత్రి అలా నడుచుకుంటూ వెళ్తుండగా..కారులో అటుగా వెళ్తోన్న ఓ వ్యక్తి గమనించాడు. ఆ యువతి దగ్గరకు వచ్చి..కత్తితో బెదిరించాడు. నోరెత్తి అరిచావంటే కత్తితో పొడిచేస్తానని బెదిరించి కారులో ఎత్తుకెళ్లిపోయాడు. ఆపై ఆమెపై అత్యాచారం చేశాడు.

ఈక్రమంలో సదరు యువతి కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన పడ్డారు. వెంటనే ఆమెను వెతుక్కుంటూ బయలుదేరారు. అలా తనకోసం వెతుక్కుంటూ వచ్చినవారిని గమనించిన సదరు యువతి సాయం కోసం పెద్దగా ఏడుస్తూ అరిచింది. ఆమె అరుపు విన్న బాధితురాలి బంధువు గబగబా అటువైపు వచ్చాడు. ఆమెని కాపాడటం కోసం.. పరుగెత్తుకుంటూ వచ్చాడు. ఈ క్రమంలో సదరు మృగాడు తాను దొరికిపోతాననే భయంతో తన దగ్గరున్న కత్తితో అతడిపై దాడి చేశాడు.

ఈలోపు మిగతా కుటుంబ సభ్యులు అక్కడకు రావడంతో నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు గ్రామానికి చెందిన ఓ యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాధితురాలు చెప్పిన పోలికలతో ఉన్న వ్యక్తి కోసం గాలిస్తున్నారు.