Flight Takes Off With Open Fuel Tank: ఇంధన ట్యాంకు తెరచి ఉండగానే విమానం టేకాఫ్.. డీజీసీఏ విచారణ
ఏలియన్స్ ఎయిర్ విమానం ఇంధన ట్యాంకు మూత తెరచి ఉండగానే టేకాఫ్ అయిన ఘటన సంచలనం రేపింది. ఏలియన్స్ ఎయిర్ కు చెందిన ఏటీ 72-600 విమానం మైసూర్ నుంచి హైదరాబాద్ కు బయలుదేరే సమయంలో ఇంధన ప్యానల్ తెరచి ఉండటాన్ని గమనించారు....

Alliance Air Flight
Alliance Air Flight Takes Off With Open Fuel Tank: ఏలియన్స్ ఎయిర్ విమానం ఇంధన ట్యాంకు మూత తెరచి ఉండగానే టేకాఫ్ అయిన ఘటన సంచలనం రేపింది. ఏలియన్స్ ఎయిర్ కు చెందిన ఏటీ 72-600 విమానం మైసూర్ నుంచి హైదరాబాద్ కు బయలుదేరే సమయంలో ఇంధన ప్యానల్ తెరచి ఉండటాన్ని గమనించారు. విమానం ఇంధన ప్యానల్ తెరచి ఉండటంపై ఏటీసీకి సమాచారం అందించారు.
China barbecue restaurant gas explosion:చైనా బార్బీక్యూ రెస్టారెంట్‌లో పేలుడు..31మంది మృతి
మైసూర్ విమానాశ్రయంలో ఈ విమానంలోకి ఇంధనం నింపలేదు. అయినా ఇంధన ట్యాంకు మూత ఎలా తెరచి ఉందనే విషయంపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ)విచారణకు(DGCA Orders Probe) ఆదేశించింది. మైసూర్ విమానాశ్రయంలో టేకాఫ్ అయిన ఎలియన్స్ ఎయిర్ విమానం వెంటనే తిరిగి విమానాశ్రయానికి వచ్చింది. విమానం ఇంధన ట్యాంకు ప్యానల్ గాలిలో తెరుచుకున్నట్లు చెబుతున్నారు.
ఇలా విమానం ఇంధన ట్యాంకు తెరిచి ఉండటం వల్ల పెద్ద ప్రమాదం జరిగేదని నిపుణులు చెబుతున్నారు. దీనిపై విచారణ జరుగుతోందని, విచారణ పూర్తయిన తర్వాత తగిన చర్యలు తీసుకుంటామని డీజీసీఏ తెలిపింది.ఈ ఘటనపై విమానయాన సంస్థ ప్రకటన చేయడానికి నిరాకరించింది.