Allu Arjun : మురగదాస్‌తో బన్నీ.. ఏకంగా ఏడు సినిమాలు లైనప్..!
అల్లు అర్జున్ ‘పుష్ప’ తర్వాత ఏం సినిమా చేస్తాడో అని ఈగర్‌గా వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్‌కి ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా ఏడు సినిమాలతో ఎంగేజ్ అయిపోయానని సర్ప్రైజ్ చేశారు..
Allu Arjun: బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బాక్సాఫీస్‌ని టార్గెట్ చేశారు బన్నీ. ఇక ఎవరైనా సరే బన్నీతో సినిమా చెయ్యాలంటే మినిమం ఐదేళ్లు ఆగాల్సిందే.. ఎందుకంటే, నెక్స్ట్ సినిమాల లైనప్ అంత గట్టిగా ప్లాన్ చేశారు. అల్లు అర్జున్ ‘పుష్ప’ తర్వాత ఏం సినిమా చేస్తాడో అని ఈగర్‌గా వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్‌కి ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా ఏడు సినిమాలతో ఎంగేజ్ అయిపోయానని సర్ప్రైజ్ చేశారు.
అల్లు అర్జున్.. ‘అల.. వైకుంఠపురములో..’ సక్సెస్ తర్వాత అదే స్పీడ్‌లో స్టార్ట్ చేసిన సినిమా ‘పుష్ప’. సుకుమార్ డైరెక్షన్లో హ్యాట్రిక్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా అనౌన్స్ చేసిన దగ్గర నుంచి ఎక్స్పెక్టేషన్స్ ఫుల్‌గా ఉన్నాయి. ఫ్యాన్స్ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సినిమా చేస్తున్న సుకుమార్.. లెంగ్త్ ఎక్కువ అవ్వడంతో సినిమాని 2 పార్ట్స్‌గా డివైడ్ చేస్తున్నారు. ఆగస్ట్ 13న ఫస్ట్ పార్ట్ రిలీజ్ అనౌన్స్ చేసింది టీమ్. అయితే ఫస్ట్ పార్ట్ రిలీజ్ అయిన వెంటనే సెకండ్ పార్ట్ రిలీజ్ అవ్వడం లేదు.. ఈ మధ్యలో వేరే సినిమా చేస్తున్నారు బన్నీ.
‘పుష్ప’ ఫస్ట్ పార్ట్ తర్వాత బన్నీ చేస్తున్న సినిమా ‘ఐకాన్’. దిల్ రాజు బ్యానర్లో, వేణు శ్రీరామ్ డైరెక్షన్లో ‘ఐకాన్’ సినిమా రెండేళ్ల క్రితమే సెట్స్ మీదకి వెళ్లాల్సింది. రకరకాల కారణాలతో ఆగిపోయిన సినిమా ఇప్పుడు తెరమీదకి వచ్చింది. ‘వకీల్ సాబ్’తో సూపర్ సక్సెస్ కొట్టిన అండర్ రేటెడ్ డైరెక్టర్ వేణు శ్రీరామ్, దిల్ రాజు కాంబినేషన్లో నెక్ట్స్ రాబోయే సినిమా ఐకానే అంటూ అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు.
‘ఐకాన్’ సినిమా కంప్లీట్ అయ్యాక ‘పుష్ప’ సెకండ్ పార్ట్‌ని ఫైనల్ చేస్తారు బన్నీ. ‘పుష్ప’, ‘ఐకాన్’ సంగతి సరే.. ఈ రెండు సినిమాలు అయిపోయాక కూడా బన్నీ బిజీయే. ‘పుష్ప’ సెకండ్ పార్ట్ అయ్యాక తమిళ్ డైరెక్టర్ మురుగదాస్‌తో ఇంట్రెస్టింగ్ స్టోరీకి కమిట్ అయ్యారు బన్నీ. స్టైలిష్ స్టార్‌తో సినిమా చేద్దామని ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్న మురుగదాస్ ఆఖరికి ఛాన్స్ దక్కించుకున్నారు. ఈ మూడు సినిమాల తర్వాత కూడా ఇంకెవ్వరికీ డేట్స్ ఇచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే బోయపాటితో మరోసారి సినిమా చెయ్యబోతున్నారు బన్నీ.
‘సరైనోడు’ తో సూపర్ సక్సెస్ ఇచ్చిన బోయపాటికి మరో ఛాన్స్ ఇచ్చారు అల్లు అర్జున్. ఈ సినిమా అయ్యాక కొరటాల శివతో ఆల్రెడీ కమిట్ అయిన సినిమా పట్టాలెక్కుతుంది. ఈ 5 సినిమాలతో పాటు ఇప్పటికే స్టార్ హీరోలతో సినిమాలు కమిట్ అయిన ప్రశాంత్ నీల్‌తో సినిమా ఆలోచన కూడా ఉంది. వీళ్లందరి షెడ్యూల్స్ అన్నీ అయిపోతే.. తన కెరీర్లో మాంచి హిట్లిచ్చిన త్రివిక్రమ్‌తో మరో సినిమా చేసే ఛాన్సుంది. ఇలా వరుసగా 7 సినిమాలతో 5 ఏళ్ల కెరీర్‌ని ఎంగేజ్ చేసేసుకున్నారు అల్లు అర్జున్.