పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన అల్లు శిరీష్..

Allu Sirish Marriage: సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ సరదాగా చెప్పిన ఓ మాటకి తాజాగా అల్లు శిరీష్ క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది. ఇంతకీ తేజ్ ఏమన్నాడంటే.. ‘వయసులో నా కంటే శిరీష్ పెద్దవాడు, త్వరలోనే అతని పెళ్లి జరగబోతోంది’.. అని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు.
దీంతో అల్లు వారి ఇంట పెళ్లి సందడి.. పెళ్లి పీటలెక్కనున్న అల్లు శిరీష్ అంటూ.. తన పెళ్లి గురించి పెద్ద ఎత్తున ప్రచారంతో పాటు రకరకాల వార్తలు వచ్చాయి. పలువురు నెటిజన్లు సోషల్ మీడియా ద్వారా శిరీష్‌పై ప్రశ్నల వర్షం కురిపించారు.
ఇదేదో తేడాగా ఉంది అనుకుని ఎట్టకేలకు ఈ ప్రచారంపై శిరీష్ స్పందించాడు. ‘‘హహహా.. తేజ్ సరదాగా జోక్ చేసి ఉంటాడు. మీరు సీరియస్‌గా తీసుకున్నారు. పెళ్లి విషయంలో మా పేరెంట్స్ నుంచి ఎలాంటి ఒత్తిడీ లేదు. పెళ్లి చేసుకోవాలనుకుని డిసైడ్ అయినప్పుడు అన్ని విషయాలూ నేనే చెబుతాను’’.. అంటూ ట్వీట్ చేశాడు శిరీష్.
Hahahaha. What!!! No. I’m sure Tej meant it as a joke and all you guys took it too seriously. My parents are chill abt me being single. Whenever I decide to get married I’ll tell you all myself. https://t.co/xkhWpctwDH
— Allu Sirish (@AlluSirish) December 17, 2020