అమెజాన్ బేసిక్స్ నుంచి స్మార్ట్ టీవీలు.. అద్భుతమైన ఫీచర్లు

అమెజాన్ బేసిక్స్ నుంచి స్మార్ట్ టీవీలు.. అద్భుతమైన ఫీచర్లు

Updated On : January 3, 2021 / 10:23 AM IST

AmazonBasics: అమెజాన్‌బేసిక్స్‌ నుంచి తొలిసారి దేశీయంగా స్మార్ట్‌ టీవీలను రిలీజ్ చేయనుంది. 50-55 అంగుళాల పరిమాణంలో రెండు వేరియంట్లలో లాంచ్ చేసింది. రూ.29వేల 999 నుంచి ధరలు ప్రారంభంకానున్నట్లు అమెజాన్‌ వెల్లడించింది. ఇవన్నీ ఫైర్‌టీవీ ఎడిషన్‌ టీవీలు.. 4K HDR LED displayతో విడుదల చేసినట్లు తెలియజేసింది. DOLBY Vision, DOLBY Atmos ఫార్మాట్లలో HDR, ఆడియో సౌకర్యాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొంది.

Amazon India వెబ్‌సైట్‌ ద్వారా వీటిని అందుబాటులో ఉంచినట్లు వెల్లడించింది. 4K స్మార్ట్‌ టీవీ విభాగంలో ఎంట్రీ లెవెల్‌ విభాగంలోని షియోమీ, TCL, Viu తదితర కంపెనీలతో ఇవి పోటీ పడనున్నట్లు టెక్‌ నిపుణులు పేర్కొన్నారు.

అమెజాన్‌బేసిక్స్‌ 50-55 అంగుళాల పరిమాణంలో రెండు మోడళ్లను విడుదల చేసింది. Ultra HD(3840+2160 పిక్సెల్‌) LED స్క్రీన్‌లను కలిగి ఉంటాయి. DOLBY Vision ఫార్మాట్ వరకూ HDR సపోర్ట్‌ ఉంటుంది. 20w రేటెడ్‌ స్పీకర్స్‌ ద్వారా DOLBY Atmosను కల్పించింది. Quadcore ఆమ్లాజిక్ ప్రాసెసర్ కలిగిన వీటికి రెండు USB, మూడు HDMI పోర్టులను ఏర్పాటు చేసింది.

అమెజాన్‌ ఫైర్‌ టీవీ ఓఎస్‌ ఆధారంగా పనిచేస్తాయి. అమెజాన్‌ ఎకోసిస్టమ్‌కు సంబంధం లేకుండా సొంత సెట్‌టాప్‌ బాక్సును ఏర్పాటు చేసుకునేందుకు వీలుంటుంది. ఫైర్‌ టీవీ స్టిక్ తరహాలో అమెజాన్‌ ప్రైమ్‌, నెట్‌ఫ్లిక్స్‌, హాట్‌స్టార్‌, యూట్యూబ్‌ తదితర సర్వీసులను యాప్స్‌ ద్వారా పొందవచ్చు. వాటితో పాటుగా అమెజాన్‌ వాయిస్‌ అసిస్టెంట్‌ అలెక్సా ద్వారా మూవీస్‌, మ్యూజిక్‌ తదితరాలను సెట్‌ చేసుకునే వీలుంది.