Anand Mahindra : పరమానందయ్య శిష్యుల్లా ఉన్నాయే ఈ జంటపక్షులు..!

ఇక్కడ ఓ జంట పక్షులు పెద్ద పనే పెట్టుకున్నాయి. ఈ పక్షులు చేసే పని చూస్తుంటే అచ్చంగా పరమానందయ్య శిష్యులు గుర్తుకొస్తారు. ఓ పక్షి మట్టి తవ్వి బయటకు పోస్తుంటే..మరొకటి మాత్రం మట్టిని గుంతలోకి పోస్తోంది. ఈ జంటపక్షులు చేసే పని చూస్తే ఏం టీమ్ వర్కురా బాబూ అనిపిస్తోంది. ఈ వీడియోను ప్రముఖ వ్యాపారవేత్త మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూపు చైర్మన్ ఆనంద్ మహీంద్రా తన ట్విట్టర్ లో షేర్ చేశారు.

Anand Mahindra : పరమానందయ్య శిష్యుల్లా ఉన్నాయే ఈ జంటపక్షులు..!

Anand Mahindra shares video of two birds to explain the concept of team work

Updated On : November 24, 2022 / 3:56 PM IST

Anand Mahindra : ఇక్కడ ఓ జంట పక్షులు పెద్ద పనే పెట్టుకున్నాయి. ఈ పక్షులు చేసే పని చూస్తుంటే అచ్చంగా పరమానందయ్య శిష్యులు గుర్తుకొస్తారు. ఓ పక్షి మట్టి తవ్వి బయటకు పోస్తుంటే..మరొకటి మాత్రం మట్టిని గుంతలోకి పోస్తోంది. ఈ జంటపక్షులు చేసే పని చూస్తే ఏం టీమ్ వర్కురా బాబూ అనిపిస్తోంది. ఈ వీడియోను ప్రముఖ వ్యాపారవేత్త మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూపు చైర్మన్ ఆనంద్ మహీంద్రా తన ట్విట్టర్ లో షేర్ చేశారు.

ఆనంద్ మహీంద్రా షేర్ చేసే వీడియోలకు..ఫోటోలకు మంచి స్పందన ఉంటుంది. ఏదో రాసాంలే..ఏదోకొటి పోస్ట్ చేశాంలే అన్నట్లుగా ఏమాత్రం ఉండవు. ఏదో కాలక్షేపం కబుర్లు మాత్రం కావు. సమాచారం, విజ్ఞానం, వినోదంతో కూడి ఉంటాయి. పెద్దగా ఎవరికీ తెలియని విషయాలు, ఫొటోలు, వీడియోలను ఆయన షేర్ చేస్తుంటారు. తాజాగా టీమ్ వర్క్ ఎలా ఉండాలో చెబుతూ.. ఓ వీడియోను ట్విట్టర్ లో షేర్ చేశారు.

ఈ వీడియోలో ఓ పక్షి ఇసుకను కాలితో పైకి ఎగదోస్తూ గోయి తవ్వుతుంటే..పైన ఉన్న మరో పక్షి తిరిగి అదే గోతిలోకి ఇసుకను నెడుతుంటుంది. దీన్ని చూస్తే కచ్చితంగా నవ్వొస్తుంది. కానీ, టీమ్ వర్క్ అంటే ఇలా ఉండకూడదని ఆనంద్ మహీంద్రా చెప్పారు. ‘‘ కొన్ని సందర్భాల్లో ప్రాజెక్టు మధ్యలో మీరు ఇలా చేస్తున్నట్టు ఉంటుంది. కానీ, మీరంతా ఒకే లక్ష్యంతో పనిచేస్తున్నారన్నది గుర్తు పెట్టుకోవాలి’’ అని ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. కొన్ని సందర్భాల్లో నిజంగా ఇలానే జరుగుతుందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.