Liquor Rates : ఏపీలో తగ్గనున్న మద్యం రేట్లు

ఆంధ్రప్రదేశ్ లో మద్యంపై   వ్యాట్ ను  ప్రభుత్వం సవరించింది.  వ్యాట్ తో పాటు స్పెషల్ మార్జిన్, అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీని సవరిస్తూ రెవెన్యూ శాఖ స్పెషల్ సెక్రటరీ రజత్ భార్గవ్ శనివారం  ఉ

Liquor Rates : ఏపీలో తగ్గనున్న మద్యం రేట్లు

AP LIquor Rates

Updated On : December 18, 2021 / 7:55 PM IST

Liquor Rates :   ఆంధ్రప్రదేశ్ లో మద్యంపై   వ్యాట్ ను  ప్రభుత్వం సవరించింది.  వ్యాట్ తో పాటు స్పెషల్ మార్జిన్, అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీని సవరిస్తూ రెవెన్యూ శాఖ స్పెషల్ సెక్రటరీ రజత్ భార్గవ్ శనివారం  ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో రాష్ట్రంలో మద్యం ధరలు తగ్గనున్నాయి.  బీర్లుపై వ్యాట్ 10 నుంచి 20 శాతం తగ్గనుంది.

స్పెషల్ మార్జిన్ 36 శాతం, అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ 36 శాతం తగ్గనుంది. ఇవి తగ్గితే మొత్తంగా ఒక బీరుపై 20-30 రూపాయల మధ్య రేట్లు తగ్గే అవకాశం ఉంది. ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ వెరైటీలపై  5-12  శాతం మేర ధరలు తగ్గే అవకాశంఉంది.

ఐఎంఎల్ లిక్కర్ పై వ్యాట్ 35 శాతం నుంచి 50శాతం వరకు తగ్గనుంది. అడిషనల్ డ్యూటీ 5 నుంచి 26 శాతం తగ్గనుంది. ఇతర రాష్ట్రాల నుంచి రాష్ట్రంలోకి   వస్తున్న  మద్యం స్మగ్లింగ్ ను నిరోధించేందుకు,  రాష్ట్రంలో నాటుసారా తయారీని అరికట్టేందుకు ప్రభుత్వం వ్యాట్‌ను క్రమబద్ధీకరించినట్లు రజత్ భార్గవ తెలిపారు.

Also Read : CJI NV Ramana : రామప్ప దేవాలయాన్ని సందర్శించిన సీజే ఎన్వీరమణ దంపతులు

వచ్చే వారంలో రాష్ట్రంలోని అన్ని మద్యం దుకాణాల్లోనూ ప్రముఖ కంపెనీల బ్రాండ్ల మద్యం విక్రయించేలా ఆదేశాలు ఇచ్చినట్లు ఆయన చెప్పారు. ఈ ఉత్తర్వులు డిసెంబరు 19 తేదీ నుంచి అమల్లోకి వస్తాయని ప్రభుత్వం పేర్కోంది.