Hat off to you Doctor : చేతికి సెలైన్ పెట్టుకుని కూడా రోగులకు వైద్యం..హ్యాట్సాఫ్ డాక్టర్
తనకు ఆరోగ్యం బాగుండక పోయినా రోగులకు సేవల చేయటం మాత్రం మానలేదో ఓ గ్రేట్ డాక్టర్. ఓ చేతికి సెలైన్ పెట్టుకుని మరో చేత్తో రోగులకు వైద్యం చేస్తున్న డాక్టర్ ను చూసినవారంతా గ్రేట్ డాక్టర్..హ్యాట్సాఫ్ డాక్టర్ అంటూ ప్రశంసిస్తున్నారు.

Grate Doctor
The Great Doctor : కళ్లముందు కనిపించే దేవుడు డాక్టర్. ముఖ్యంగా ఈకరోనా సమయంలో డాక్టర్లు ప్రజలపాలిట దేవుడిగానే కీర్తింపబడుతున్నారు. కుటుంబాలను వదిలేసుకుని..చిన్న చిన్న పిల్లలను కూడా వదిలేసి రోజుకు 24 గంటలు రోగుల సేవలకే అంకితమై ఎన్నో కుటుంబాల్లో వెలుగులు నింపారు. గంటల తరబడి డ్యూటీలు చేస్తూ వారి ఆరోగ్యాలను కూడా పట్టించుకోకుండా రోగుల కోసమే సేవలందిస్తున్నారు. కనిపించే దేవుడిగా డాక్టర్లకు చేతులెత్తి మొక్కుతాం. అంతటి గొప్పది డాక్టర్ వృతి.
తూర్పుగోదావరి జిల్లాలోని సుందర్ ప్రసాద్ అనే ఓ డాక్టర్ వృత్తి పట్ల చూపించే అంకిత భావం గురించి తెలిస్తే ‘హ్యాట్సాఫ్ డాక్టర్’ అని తీరతాం. తనకు ఆరోగ్యం బాగుండకపోయినా..ఓచేతికి సెలైన్ బాటిల్ పెట్టుకుని మరో చేత్తో రోగులకు వైద్యం చేస్తున్నారు. ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా వీఆర్‌పురం మండలంలోని రేఖపల్లి ప్రభుత్వ ఆస్పత్రిలో డాక్టర్ సుందర్ ప్రసాద్ రోగుల పాలిట ప్రత్యక్ష దేవుడిగా పేరొందారు. డ్యూటీ గురించి తప్ప మరో ధ్యాస లేని మహోన్నతమైన డాక్టర్ సుందర్ ప్రసాద్. రోగుల బాగోగు చూసుకోవటంలో తన ఆరోగ్యాన్ని కూడా పట్టించుకోలేదు.
దీంతో సుందర్ ప్రసాద్ అనారోగ్యానికి గురయ్యారు. అయిన ఆయన మనస్సు రోగులమీదే. వారికి సేవల చేయాలనే తపనతో తన అనారోగ్యాన్ని కూడా పట్టించుకోకుండా..ఒక చేతికి సెలైన్ పెట్టించుకుని కూడా రోగులకు సేవలు చేస్తూనే ఉన్నారు. బెడ్ మీడ పడుకుని విశ్రాంతి తీసుకుంటూ సెలైన్ ఎక్కించుకోవాలి. చేయి కదపకుండా..సెలైన్ ఎక్కించుకోవాలి.
కానీ ఈ డాక్టర్ సుందర్ ప్రసాద్ మాత్రం తనకు బాగుండకపోయినా ఏమాత్రం విశ్రాంతి తీసుకోకుండా ఓ కుర్చీలో కూర్చుని సెలైన్ పెట్టించుకుని మరోపక్క హాస్పిటల్ కి వచ్చిన రోగులకు వైద్యం అందిస్తున్నారు. డాక్టర్ సుందర్ ప్రసాద్ చేసేది గవర్నమెంట్ ఉద్యోగం. అనారోగ్యంగా ఉంటే సిక్ లీవ్ పెట్టుకోవచ్చు. కానీ సుందర్ ప్రసాద్ అలా అనుకోలేదు. నేను వెళ్లకపోతే ఎంతో మంది రోగులకు వైద్యం అందింటం ఆలస్యం అవుతుంది..అనుకున్నారు. అలా ఓ చేత్తో సెలైన్ ఎక్కించుకుంటూనే మరో చేత్తోరోగులకు వైద్యం చేస్తున్నారు.