విద్యార్థులకు ఆపిల్ ఆఫర్.. MacBook Air కొంటే… ఫ్రీగా ఎయిర్ ఫాడ్స్

  • Published By: srihari ,Published On : June 16, 2020 / 08:31 AM IST
విద్యార్థులకు ఆపిల్ ఆఫర్.. MacBook Air కొంటే… ఫ్రీగా ఎయిర్ ఫాడ్స్

Updated On : June 16, 2020 / 8:31 AM IST

ప్రపంచ టెక్ దిగ్గజం ఆపిల్ కంపెనీ విద్యార్థుల కోసం హెడ్ ఫోన్లు ఆఫర్ చేస్తోంది. 2020లో ఆపిల్ బ్యాక్-టు-స్కూల్ ప్రమోషన్‌లో బిజీగా ఉంది. ఆపిల్ ఎడ్యుకేషన్ స్టోర్‌లో విద్యార్థులు, అధ్యాపకులు 899 డాలర్లు మాక్‌బుక్ ఎయిర్ లేదా 479 డాలర్ల ఐప్యాడ్ ఎయిర్‌ను కొనుగోలు చేసినప్పుడు సెకండ్ జనరేషన్ ఎయిర్‌పాడ్‌లను ఉచితంగా పొందవచ్చు. అదనంగా 40 డాలర్లతో వైర్‌లెస్ ఛార్జింగ్ కేసుతో ఎయిర్‌పాడ్స్‌కు అప్‌గ్రేడ్ చేసే అవకాశాన్ని ఆపిల్ ఇస్తోంది. 

జేబులో 90 డాలర్లతో ఎయిర్‌పాడ్స్ ప్రో కొనుగోలు చేసుకోవచ్చు. ఐప్యాడ్ ఎయిర్, మ్యాక్ బుక్ ఎయిర్ ఈ ఒప్పందానికి ఎంట్రీ పాయింట్ కాగా, 2020 ఐప్యాడ్ ప్రో పలు సైజుల్లో మాక్‌బుక్ ప్రోలతో ఉచిత హెడ్‌ఫోన్‌లను పొందవచ్చు. ఆపిల్ బ్యాక్-టు-స్కూల్ ప్రమోషన్‌లో చేర్చిన ఉత్తమ ఫ్రీబీ.

ఇది కొనడానికి 500 డాలర్లు కంటే ఎక్కువ ఖర్చు చేయనవసరం లేదు. కీబోర్డ్, ట్రాక్‌ప్యాడ్, ఐప్యాడోస్ కంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న ఓఎస్‌తో వెళ్లడానికి సిద్ధంగా ఉన్న సమర్థవంతమైన ల్యాప్‌టాప్ కావాలంటే 899 డాలర్లతో మ్యాక్ బుక్ ఎయిర్ పొందాల్సి ఉంటుంది. 

ఏయే ల్యాప్‌టాప్‌లు, డెస్క్‌టాప్‌లపై ఆఫర్లు ఉన్నాయంటే? 

* 21.5-అంగుళాల లేదా 27-అంగుళాల ఐమ్యాక్
* 27-అంగుళాల ఐమాక్ ప్రో
* 13.3-అంగుళాల మాక్‌బుక్ ఎయిర్
* 13.3-అంగుళాల మాక్‌బుక్ ప్రో
* 16-అంగుళాల మాక్‌బుక్ ప్రో
* 10.5-అంగుళాల ఐప్యాడ్ ఎయిర్
* 11-అంగుళాల ఐప్యాడ్ ప్రో (2020)
* 12.9-అంగుళాల ఐప్యాడ్ ప్రో (2020)