Skipping Meals : బరువు తగ్గటం కోసం డైటింగ్ పేరుతో తిండితినటం మానేస్తున్నారా? ప్రమాదం కొనితెచ్చుకోన్నట్లే!
డైటింగ్ కారణంగా ఎదిగే వయస్సులో వారి ఎముకలు దెబ్బతింటాయి. గుండె బలహీనపడి పోతుంది. పోషకాహారం లోపిస్తే గుండె కండరాలు బలహీనంగా మారిపోయి కుచించుకుపోతుంది. రక్తపోటు, పల్స్ రేటు తగ్గటం వంటి సమస్యలు ఉత్పన్నం అవుతాయి.

skipping meals in the name of dieting
Skipping Meals : సన్నగా నాజుగ్గా కనిపించాలని చాలా మంది డైటింగ్ పేరుతో తిండిని మానేయటం ఇటీవలి కాలంలో ఫ్యాషన్ గా మారింది. ముఖ్యంగా ఎదుగుతున్న వయస్సులో ఉన్న ఆడపిల్లలు ఈ తరహా డైటింగ్ ల పేరుతో ఆరోగ్యాన్ని ప్రమాదం అంచులకు నెట్టేస్తున్నారు. ఆహారం అధికంగా తీసుకుంటే బరువు పెరుగుతామన్న భయంతో అతి తక్కువ మొత్తంలో తీసుకుంటున్నారు. దీని వల్ల సన్నగా అవ్వటం అటుంచి శరీరంలో శక్తిని కోల్పోయి రోగనిరోధక శక్తి తగ్గి వ్యాధుల భారిన పడాల్సి వస్తుంది. అంతే కాకుండా మానసిక వ్యాధులు వచ్చే ప్రమాదం పొంచి ఉంటుంది.
డైటింగ్ కారణంగా ఎదిగే వయస్సులో వారి ఎముకలు దెబ్బతింటాయి. గుండె బలహీనపడి పోతుంది. పోషకాహారం లోపిస్తే గుండె కండరాలు బలహీనంగా మారిపోయి కుచించుకుపోతుంది. రక్తపోటు, పల్స్ రేటు తగ్గటం వంటి సమస్యలు ఉత్పన్నం అవుతాయి. నీరసం, కాళ్లు, చేతులు లాగటం, నెలసరి బహిస్టు ఆగిపోవటం, ముఖంలో మార్పులు, ఉత్సాహం కోల్పోవటం, చర్మం పొడిబారి వెంట్రుకలు ఊడిపోవటం వంటి సమస్యలన్నీ చుట్టుముడతాయి.
బరువు తగ్గటం కోసం ఆహారం తినటం మానేయటం, ఉపవాసాలు చేయటం ఏమాత్రం సరైంది కాదని నిపుణులు సూచిస్తున్నారు. రోజు వారి తీసుకునే ఆహారంలో మార్పులు చేసుకోవటం, పోషకాలతో కూడిన ఆహారాన్ని తీసుకోవటం, చిరుతిళ్లు, నూనె పదార్ధాలు, తగ్గించుకోవటం వంటివి ఆచరించాలి. రోజువారిగా వ్యాయామాలు చేస్తూ బరువు తగ్గేందుకు ప్రయత్నించటం వల్ల ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బంది ఉండదని నిపుణులు సూచిస్తున్నారు.