Aryan Khan Released: జైలు నుంచి ఆర్యన్ విడుదల.. షారుక్ కొడుకుకు షరతులు ఇవే!

ముంబై క్రూయిజ్ డ్రగ్స్ కేసులో బెయిల్ పొందిన బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ 22 రోజుల తర్వాత ఈరోజు ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలు నుండి విడుదలయ్యాడు.

Aryan Khan Released: జైలు నుంచి ఆర్యన్ విడుదల.. షారుక్ కొడుకుకు షరతులు ఇవే!

Aryan

Updated On : October 30, 2021 / 11:34 AM IST

Aryan Khan Released: ముంబై క్రూయిజ్ డ్రగ్స్ కేసులో బెయిల్ పొందిన బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ 28 రోజుల తర్వాత ఈరోజు ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలు నుండి విడుదలయ్యాడు. ఆర్యన్ తండ్రి షారుక్ ఖాన్‌తో కలిసి మన్నత్‌కు వెళ్లాడు.

ఆర్యన్ ఖాన్‌ను తన కారులో తీసుకుని వెళ్లేందుకు షారుక్ ఖాన్ స్వయంగా ఆర్థర్ రోడ్ జైలుకు వచ్చాడు. జైలు బయట.. షారుక్ ఇళ్లు మన్నత్ వెలుపల పెద్ద సంఖ్యలో ప్రజలు గుమికూడారు.

ఆర్యన్ ఖాన్ విడుదల సమయంలో చాలా సంతోషంగా ఉన్నట్లు ఆర్థర్ రోడ్ జైలు అధికారి వెల్లడించాడు. ఇతర ఖైదీలతో చివర్లో కలిసి, మాట్లాడిన తర్వాత ఆర్యన్ బయటకు వచ్చాడు. ఆర్యన్ ఖాన్ సరిగ్గా ఉదయం 11 గంటల సమయంలో విడుదలయ్యాడు. అక్టోబర్ 2వ తేదీన ఆర్యన్ జైలుకు వెళ్లాడు. ఆర్యన్‌కు బెయిల్ వచ్చింది కానీ, కేసు నుంచి మాత్రం బయటపడలేదు.

షరతులపై ఆర్యన్ విడుదల:
ఆర్యన్ ఖాన్‌కు బెయిల్ మంజూరు చేస్తూ కోర్టు కొన్ని షరతులు కూడా విధించింది.
దర్యాప్తు అధికారికి సమాచారం ఇవ్వకుండా ఆర్యన్ ఖాన్ ముంబై వదిలి వెళ్లకూడదు.
ప్రతి శుక్రవారం, NCB కార్యాలయానికి ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల మధ్య వచ్చి హాజరవ్వాలి.
ఇతర నిందితులతో సంబంధాలు పెట్టుకోరాదు.
విచారణకు సంబంధించిన విషయాలను మీడియా లేదా సోషల్ మీడియాలో పంచుకోకూడదు.
ఆర్యన్ తన పాస్‌పోర్ట్‌ను ప్రత్యేక NDPS కోర్టులో సమర్పించాల్సి ఉంటుంది.
కోర్టు అనుమతి లేకుండా దేశం బయటకు వెళ్లకూడదు.
ఏదైనా షరతు ఉల్లంఘించాల్సి వస్తే, NCB ప్రత్యేక న్యాయమూర్తికి దరఖాస్తు చేసుకోవాలి.