Spencer Johnson: ఎవరీ స్పెన్సర్ జాన్సన్? అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న యువ సంచలనం

ఆస్ట్రేలియా యువ పేసర్ స్పెన్సర్ జాన్సన్  అదరగొట్టాడు. ది హెండ్రెడ్ లీగ్‌లో అరంగేట్రం చేసిన జాన్సన్ అత్యుద్భుత గణాంకాలను నమోదు చేశాడు.

Spencer Johnson: ఎవరీ స్పెన్సర్ జాన్సన్? అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న యువ సంచలనం

Spencer Johnson

Spencer Johnson: ఆస్ట్రేలియా యువ పేసర్ స్పెన్సర్ జాన్సన్  (Spencer Johnson) అదరగొట్టాడు. ది హెండ్రెడ్ లీగ్‌ (The Hundred League) లో అరంగేట్రం చేసిన జాన్సన్ అత్యుద్భుత గణాంకాలను నమోదు చేశాడు. ఇంగ్లండ్ హెండ్రెడ్ లీగ్‌లో ఓవర్ ఇన్విసిబుల్‌ (Oval Invincibles) కు జాన్సన్ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈ క్రమంలో లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవల్ వేదికగా మాంచెస్టర్ ఒరిజినల్స్ (Manchester Originals) తో మ్యాచ్‌లో అద్భుత ప్రతిభను జాన్సన్ కనబర్చాడు.

Eden Gardens: ప్రపంచ కప్‌కోసం సిద్ధమవుతున్న ఈడెన్ గార్డెన్స్‌ మైదానంలో అగ్నిప్రమాదం.. ఎలా జరిగిందంటే?

ఈ మ్యాచ్‌లో జాన్సన్ 20 బాల్స్ వేయగా.. అందులో 19 డాట్ బాల్స్ ఉన్నాయి. కేవలం ఒక్క పరుగు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు తీసి అందరి దృష్టిని ఆకర్షించాడు. జాన్సన్ కు తోడు సునిల్ నరైన్ మూడు వికెట్లు తీయడంతో పర్యాటక మాంచెస్టర్ జట్టు 89 బంతులాడి 92 పరుగులకే కుప్పకూలింది. అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఓవల్ జట్టు 186 పరుగులు చేసింది. దీంతో మాంచెస్టర్ పై 94 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఉసామా మీర్, టామ్ హార్లీ, జోష్ లిటిల్ ముగ్గురిని ఔట్ చేసిన జాన్సన్ కేవలం మూడు పరుగులే ఇవ్వడంతో అందరి దృష్టి స్పెన్సర్ జాన్సన్ పై పడింది. ఎవరీ జాన్సన్ అని క్రికెట్ అభిమానులు వెతుకులాట మొదలు పెట్టారు.

World Cup 2023 Tickets: వరల్డ్ కప్ మ్యాచ్‌ల టికెట్ల విక్రయ తేదీలు వచ్చేశాయ్.. దశల వారీగా భారత మ్యాచ్‌ల టికెట్లు.. తేదీలు ఇలా ..

ఆస్ట్రేలియాకు చెందిన ఫస్ట్ క్లాస్ క్రికెటర్ స్పెన్సర్ జాన్సన్ 16 డిసెంబర్ 1995లో జన్మించాడు. ఎడమచేతి వాటం పాస్ట్ బౌలర్. ఇప్పటికే వివిధ టీ20 లీగ్‌లలో అనేక జట్ల తరపున ఆడాడు. స్పెన్సన్ జాన్సన్ 2017లో తన లిస్ట్ -ఎ అరంగేట్రం చేశాడు. కానీ, అతని ఫస్ట్ క్లాస్, టీ20 అరంగేట్రం చేయడానికి అతనికి మరో ఆరు సంవత్సరాలు పట్టింది. అతని కెరీర్ విషయానికొస్తే అతను ఇప్పటి వరకు 4ఎఫ్‌సీ, 5లిస్ట్ ఏ, 11 టీ20 మ్యాచ్ లలో ఆడాడు. మూడు ఫార్మాట్లలో వరుసగా 20.6 సగటుతో 12 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. తాజాగా ఆస్ట్రేలియా టీ20 జట్టులోకి ప్రవేశించిన స్పెన్సర్ జాన్సన్.. ఈనెల చివరిలో తన అంతర్జాతీయ అరంగేట్రం చేసే అవకాశం ఉంది. 27 జాన్సన్ తను ఆటతీరుకు పదునుపెట్టి టీ20 ప్రపంచ కప్ ఆస్ట్రేలియా జట్టులో ఆడేందుకు పట్టుదలతో ఉన్నాడు.