Ayushmann Khurrana : ఆ వ్యాధితో ఆరేళ్లుగా బాధపడుతున్నా.. బాలీవుడ్ స్టార్ హీరో వ్యాఖ్యలు..

తాజాగా బాలీవుడ్‌ స్టార్‌ హీరో ఆయుష్మాన్‌ ఖురానా తనకి కూడా ఓ వ్యాధి ఉందని, ఆరేళ్లుగా ఆ వ్యాధితో పోరాడుతున్నాను అని తెలిపాడు. త్వరలో ఆయుష్మాన్ ఖురానా..........

Ayushmann Khurrana : ఆ వ్యాధితో ఆరేళ్లుగా బాధపడుతున్నా.. బాలీవుడ్ స్టార్ హీరో వ్యాఖ్యలు..

Ayushmann Khurrana effected with vertigo from past six years

Updated On : November 23, 2022 / 7:43 AM IST

Ayushmann Khurrana : ఇటీవల కొంతమంది సెలబ్రిటీలు తమకి ఉన్న వ్యాధుల గురించి సంకోచించకుండా మీడియా ముందు చెప్తున్నారు. అందరూ అనుకున్నట్టు సెలబ్రిటీల లైఫ్ సూపర్ గా ఉంటుంది అని కాకుండా వాళ్ళకి కూడా సమస్యలు, బాధలు ఉంటాయని పలువురు సెలబ్రిటీలు మీడియా ముందు మాట్లాడుతున్నారు. ఇటీవల సమంతతో పాటు మరికొంతమంది నటీనటులు తమకి ఉన్న వ్యాధుల గురించి మీడియా ముందు బయటపెట్టారు.

తాజాగా బాలీవుడ్‌ స్టార్‌ హీరో ఆయుష్మాన్‌ ఖురానా తనకి కూడా ఓ వ్యాధి ఉందని, ఆరేళ్లుగా ఆ వ్యాధితో పోరాడుతున్నాను అని తెలిపాడు. త్వరలో ఆయుష్మాన్ ఖురానా నటించిన ‘ఆన్‌ యాక్షన్‌ హీరో’ సినిమా రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయుష్మాన్ ఈ విషయాన్ని బయటపెట్టాడు.

Rajasekhar Reddy : సుధీర్, రష్మీ.. ఇద్దర్నీ పెట్టి గజ్జెల గుర్రం సినిమా చేస్తాను..

ఆయుష్మాన్ ఖురానా మాట్లాడుతూ.. నేను గత ఆరేళ్లుగా వెర్టిగో సమస్యతో బాధపడుతున్నాను. సినిమాల్లో కొన్ని సీన్స్ తీసేటప్పుడు ఇది నన్ను మరింత బాధపెడుతోంది. ఈ సమస్య నన్ను చాలా ఆందోళనకు గురిచేస్తుంది. నా కొత్త సినిమా ‘ఆన్‌ యాక్షన్‌ హీరో’లో ఎత్తైన భవనం నుంచి దూకే సీన్‌ ఉంది. ఆ సీన్ చేసేటప్పుడు నన్ను రోప్స్ కి కట్టినా కూడా నేను చాలా భయపడ్డాను, నాకేదో అయిపోతుంది అన్నట్టు అనిపించింది. ఆ బాధ నన్ను ఇబ్బందికి గురిచేస్తుంది” అని తెలిపాడు.