Baby Elephant : ఈ బుజ్జి ఏనుగు మంచి మేత కోసం ఎలా వెతుకుతుందో చూడండి..!

ఈ బుజ్జి ఏనుగుకు బాగా ఆకలి వేసింది. ఏమి తినాలో అర్థం కాలేదు. ఎప్పుడూ తల్లి ఏనుగు పక్కన ఉండేది. ఈసారి తల్లి లేకుండానే సొంతంగా ఆహారం కోసం బయల్దేరింది. అడవిలో తన తినగలిగే మేత గడ్డి కోసం వెతకడం మొదలుపెట్టింది.

Baby Elephant : ఈ బుజ్జి ఏనుగు మంచి మేత కోసం ఎలా వెతుకుతుందో చూడండి..!

Baby Elephant Learns The Art Of Choosing Perfect Grass

Updated On : July 7, 2021 / 9:49 PM IST

Baby elephant choosing perfect grass : ఈ బుజ్జి ఏనుగుకు బాగా ఆకలి వేసింది. ఏమి తినాలో అర్థం కాలేదు. ఎప్పుడూ తల్లి ఏనుగు పక్కన ఉండేది. ఈసారి తల్లి లేకుండానే సొంతంగా ఆహారం కోసం బయల్దేరింది. అడవిలో తన తినగలిగే మేత గడ్డి కోసం వెతకడం మొదలుపెట్టింది. ఏ గడ్డి మేయాలో తెలియక తికమక పడుతోంది.


ఒక నిమిషం 23 సెకన్ల నిడివి గల ఈ వీడియోలో తనకు నచ్చిన గడ్డిని ఎలా గుర్తుపట్టాలో తెలుసుకునేందుకు బుడిబుడి అడుగులు వేస్తూ తనవంతు ప్రయత్నిస్తోంది పాపం.. చూడటానికి ఎంతో క్యూట్ గా అనిపిస్తున్న ఈ బుజ్జి ఏనుగు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


దీనికి 4వేలపైనే వ్యూస్ వచ్చాయి. ప్రవీణ్ కాశ్వన్ అనే ఫారెస్ట్ సర్వీసు ఆఫీసర్ ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. వీడియోను చూసిన నెటిజన్లు.. ఎంత క్యూట్ గా ఉంది ఈ బుజ్జి ఏనుగు అంటూ ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు.. మంచి ఆహారం విలువ దానికి తెలుసునని అదే… మంచి గడ్డి మేత కోసం తెగ వెతికేస్తోందని ట్విట్టర్ యూజర్ ఒకరు కామెంట్ పెట్టారు.