Bandi Sanjay : అమిత్ షాను తాకటమే అదృష్టంగా భావిస్తా : బండి
‘అమిత్ షా నాకు గురువు..ఆయనంటే నాకు ఎనలేని గౌరవం..అమిత్ షా చెప్పులు మోయటమే కాదు ఆయనను తాకటమే అదృష్టంగా భావిస్తాను’ అంటూ అమిత్ షా చెప్పులు మోసిన అంశంపై బండి సంజయ్ టీఆర్ఎస్ నేతలకు ఘాటు సమాధానం ఇచ్చారు.

Bandi Sanjay on Amit Shah sandals handover issue
Bandi Sanjay on Amit Shah sandals handover issue : అమిత్ షా చెప్పులు మోసానని వస్తున్న ప్రచారంపై తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ స్పందించారు. జనగామ పాదయాత్రలో కొనసాగతున్న బండి సంజయ్ అమిత్ షా చెప్పులు మోసిన అంశంపై టీఆర్ఎస్ నేతలు చేస్తున్న ట్రోలింగ్స్ పై ఘాటుగా స్పందించారు. ‘అమిత్ షా నాకు గురువు..ఆయనంటే నాకు ఎనలేని గౌరవం..అమిత్ షా చెప్పులు మోయటమే కాదు ఆయనను తాకటమే అదృష్టంగా భావిస్తాను’ అంటూ సమాధానం చెప్పారు.
టీఆర్ఎస్ ఎమ్మెల్సీ..సీఎం కేసీఆర్ కుమార్తె..మంత్రి కేటీఆర్ సోదరి అయిన కవితపై వచ్చిన ఢిల్లీ మద్యం స్కామ్ ఆరోపణలపై కూడా బండి సంజయ్ స్పందిస్తు..కవిత లిక్కర్ స్కామ్ ఇష్యూని పక్కదోవ పట్టించటానికే టీఆర్ఎస్ నేను అమిత్ షా చెప్పులు మోసాననే ప్రచారం చేస్తోందని అమిత్ షా చెప్పులు మోయటం కాదు ఆయనను తాకటమే అదృష్టంగా భావిస్తానంటూ టీఆర్ఎస్ నేతలకు బదులిచ్చారు. అంతేకాదు ఎమ్మెల్యేలు కేసీఆర్ కాళ్లు మొక్కినప్పుడు తెలంగాణ ఆత్మగౌరవం ఏమైపోయింది? అప్పుడు గుర్తు రాలేదా ఈ ప్రచారం చేసే నేతలను తెలంగాణ ఆత్మగౌరవం గురించి అంటూ ఘాటు సమాధానం ఇచ్చారు.
కాగా ఆదివారం (ఆగస్టు 21,2022) మునుగోడు సభలో పాల్గొనేందుకు కేంద్ర మంత్రి అమిత్ షా హైదరాబాద్ వచ్చారు. ఈ సందర్భంగా అమిత్ షా సికింద్రాబాద్ ఉజ్జయిని మహాంకాళి ఆలయాన్ని సందర్శించుకున్నారు. ఈ సమయంలో అమ్మవారి ఆలయం వద్ద షాకు తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ చెప్పులు తీసి అందించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీనిపై టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ నేతలు సెటైర్లు వేస్తున్నారు. ఢిల్లీ చెప్పులు మోసే గుజారాతీ గులాములం అంటూ మంత్రి కేటీఆర్ సెటైర్ వేస్తే..బీజేపీలో బీజేపీ నేతల పరిస్థితి ఇది అంటూ కాంగ్రెస్ నేత మాణిక్కం ఠాకూర్ సెటైర్ వేశారు. షాకు బండి సంజయ్ చెప్పులు తీసి ఇచ్చిన వీడియో షేర్ చేస్తున్న టీఆర్ఎస్ శ్రేణులు బండి సంజయ్‌ను ట్రోల్ చేస్తున్నారు.