‘బిగ్ బాస్ 4’ : లవ్లీ గర్ల్ మోనాల్ ఎలిమినేట్ అయితే అఖిల్, అభిజిత్‌ల ముఖ చిత్రాలు ఏంటో?

  • Published By: sekhar ,Published On : December 5, 2020 / 08:00 PM IST
‘బిగ్ బాస్ 4’ : లవ్లీ గర్ల్ మోనాల్ ఎలిమినేట్ అయితే అఖిల్, అభిజిత్‌ల ముఖ చిత్రాలు ఏంటో?

Updated On : December 5, 2020 / 9:28 PM IST

Bigg Boss 4 – Monal Eliminated: ‘కింగ్’ నాగార్జున హోస్ట్ చేస్తున్న టెలివిజన్ బిగ్గెస్ట్ రియాలిటీ షో ‘బిగ్ బాస్’ సీజన్ 4 రసవత్తరంగా సాగుతోంది. మరికొద్ది రోజుల్లో ముగియనున్న ఈ షో లో ఎలిమినేషన్ ఎవరు, టైటిల్ గెలిచేది ఎవరు అంటూ సోషల్ మీడియాలో ఆసక్తికరమైన చర్చలు జరుగుతున్నాయి.



ఇదిలా ఉంటే గత వారం ఎవరూ ఇంటి నుండి బయటకు రాలేదు. దీంతో ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారనే క్యూరియాసిటీ పెరిగింది ఆడియెన్స్‌లో.. అవినాష్, హారిక, మోనాల్, అఖిల్, అభిజిత్ ఈ వారం ఎలిమినేషన్ నామినేట్ అయ్యారు. భారీ ఉత్కంఠత తర్వాత ఎట్టకేలకు మోనాల్ బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయినట్లు కథనాలు వినిపిస్తున్నాయి.


మోనాల్, అఖిల్, అభిజిత్‌ల మధ్య ట్రయాంగిల్ లవ్ స్టోరీ జరుగుతున్న సంగతి తెలిసిందే.. మరి మోనాల్ హౌస్ విడిచి వెళ్లిపోతే వీరిద్దరి రియాక్షన్ ఎలా ఉంటుందనేది చూడాలి. గతకొద్ది వారాలుగా మోనాల్ ఎలిమినేట్ అవనుందని వార్తలు వినిపించాయి. లాస్ట్ వీక్ ఎలిమినేషన్ లేదు కాబట్టి ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని, మోనాల్ తర్వాత అవినాష్ హౌస్ నుంచి బయటకొచ్చే అవకాశముందని సమాచారం.