Bigg Boss 4: హౌస్ నుండి బయటకొచ్చేసిన మోనాల్..!

  • Published By: sekhar ,Published On : December 13, 2020 / 02:36 PM IST
Bigg Boss 4: హౌస్ నుండి బయటకొచ్చేసిన మోనాల్..!

Updated On : December 13, 2020 / 2:59 PM IST

Bigg Boss 4 – Monal Gajjar Eliminated: నాగార్జున హోస్ట్ చేస్తున్న టెలివిజన్ బిగ్గెస్ట్ రియాలిటీ షో ‘బిగ్ బాస్’ సీజన్ 4 ఫైనల్ స్టేజ్‌కొచ్చేసింది. మరో వారం రోజుల్లో ముగియనున్న ఈ షో లో లాస్ట్ వీక్ ఎలిమినేట్ అయ్యేది ఎవరు, టైటిల్ గెలిచేది ఎవరు అంటూ సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి.. ఆసక్తికరమైన చర్చలు కూడా జరుగుతున్నాయి. పోయిన వారం మాస్ అవినాష్ హౌస్ నుండి బయటకొచ్చేశాడు.

దేత్తడి హారిక, మోనాల్, అఖిల్, సోహైల్, అభిజిత్, ఆరియానా ఈ వారం ఎలిమినేషన్‌కు నామినేట్ అయ్యారు. అఖిల్ బిగ్‌బాస్ 4 ఫస్ట్ ఫైనలిస్ట్‌గా ఫిక్స్ అయ్యాడు. మిగతా ఐదుగురిలో ఎవరు ఇంటినుంచి బయటకొచ్చేస్తారు అనే భారీ ఉత్కంఠత మధ్య ఎట్టకేలకు మోనాల్ ఎలిమినేట్ అయ్యిందని సమాచారం.

మోనాల్, అఖిల్, అభిజిత్‌ల మధ్య ట్రయాంగిల్ లవ్ స్టోరీ జరుగుతున్న సంగతి తెలిసిందే.. మరి మోనాల్ హౌస్ విడిచి వెళ్లిపోతే వీరిద్దరి రియాక్షన్ ఎలా ఉంటుందనేది చూడాలి.
ఈ వీక్ మోనాల్ కాదు.. దేత్తడి హారిక ఎలిమినేట్ అయ్యిందని, ఫైనల్ వీక్ విన్నర్‌ని అనౌన్స్ చేయడానికి సూపర్‌స్టార్ మహేష్ బాబు గెస్ట్‌గా రాబోతున్నారని కూడా వార్తలు వినిపిస్తున్నాయి.