Vijayawada : దుర్గగుడి ఫ్లైఓవర్ పై రేసింగ్..తుపాకీ స్టంట్లతో అలజడి.. క్రిమినల్ కేసు నమోదు
రేసులు పేరుతో కుర్రకారు తమ ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారు. రేసుల్లో పాల్గొని మృతి చెందిన వారిని చూసైనా యువతలో మార్పు రావడం లేదు.

Vijayawada
Vijayawada : రేసులు పేరుతో కుర్రకారు తమ ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారు. రేసుల్లో పాల్గొని మృతి చెందిన వారిని చూసైనా యువతలో మార్పు రావడం లేదు. వారు ప్రాణాలమీదకు తెచుకునేది కాకుండా వాహన దారుల ప్రాణాలను కూడా హరిస్తున్నారు. రేసులు కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏడాది వ్యవధిలో పదిమందికి పైగా మరణించారు. ఇక రేసులో పాల్గొనే సమయంలో వారు చేసే స్టంట్లు తోటి వాహన దారులకు దడ పుట్టిస్తున్నాయి.
Read More : Thirumala : శ్రీవారి ఆలయంలో అక్టోబర్ 5న వీఐపీ బ్రేక్ దర్శనం రద్దు
ఎక్కడొచ్చి తమ మీదపడతారో అని హడలిపోతున్నారు వాహనదారులు. తాజాగా దుర్గగుడి ఫ్లైఓవర్ పై ప్రమాదకర స్టెంట్స్ చేస్తూ కెమెరాలకు చిక్కారు ఇద్దరు యువకులు. టాయ్ గన్ చేతిలో పట్టుకొని బైక్ పై నిలబడి స్టంట్స్ చేశారు. అత్యంత వేగంగా బైక్ నడుపు తోటి ప్రయాణికులకు గుబులుపుట్టిస్తున్నారు. వారు ప్రమాదానికి గురవ్వడమే కాకుండా ఆ రోడ్డుపై ప్రయాణించే వారి ప్రాణాలకు కూడా ముప్పు వాటిల్లేలా చేస్తున్నారు.
తాజాగా విజయవాడ దుర్గగుడి ఫ్లైఓవర్ పై జరిగిన రేసుకు సంబందించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ దృశ్యాలు పొలుసులు కంటపడటంతో విచారణ చేపట్టారు. రేసులో పాల్గొన్న యువకుల కోసం గాలింపు చేపట్టారు. బైక్ లకు నంబర్ ప్లేట్లు లేకపోవడంతో వారిని గుర్తించడం కొంచం కష్టంగా మారింది.
Read More : North Korea : తగ్గేదే లే అంటున్న కిమ్..మరో మిసైల్ ప్రయోగం
వీడియోల ఆధారంగానే రేసర్లను గుర్తించే పనిలో పడ్డారు పోలీసులు. ఇక ఏప్రిల్ నెలలో దుర్గగుడి ఫ్లైఓవర్ పై బైక్ స్టెంట్స్ చేసిన ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకోని తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ ఇప్పించారు. ఆ తర్వాత దుర్గగుడి ఫ్లైఓవర్ పై రేసులు జరగలేదు. ఇక తాజాగా ఇద్దరు యువకులు ఫ్లైఓవర్ పై దూసుకెళ్లారు. ప్రస్తుతం వారికోసమే పోలీసులు గాలిస్తున్నారు.
View this post on Instagram