Bandi sanjay : తెలంగాణ భవన్ లో అంబేద్కర్ విగ్రహానికి బండి సంజయ్ పాలాభిషేకం

తెలంగాణ భవన్ లో అంబేద్కర్ విగ్రహానికి బండి సంజయ్ పాలాభిషేకం చేశారు. అనంతరం సీఎం కేసీఆర్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు.

Bandi sanjay : తెలంగాణ భవన్ లో అంబేద్కర్ విగ్రహానికి బండి సంజయ్ పాలాభిషేకం

Bjp State Chief Bandi Sanjay Counter To Cm Kcr

Updated On : February 2, 2022 / 2:53 PM IST

bjp state chief bandi sanjay counter to cm kcr : సీఎం కేసీఆర్ పై తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ విరుచుకుపడ్డారు. ఢిల్లీ తెలంగాణ భవన్ లో నిరసన వ్యక్తం చేసిన నేతలు అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. అనంతరం కేసీఆర్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు బండి సంజయ్. రాజ్యాంగాన్ని తిరిగి రాయాలని అన్న వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ వ్యాఖ్యలకు నిరసననగా తెలంగాణ భవన్ లో అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకరం చేశారు. ఈ సందర్భంగా బండి సంజయ్ కేసీఆర్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

రాజ్యాంగం గురించి ఇటువంటి వ్యాఖ్యలు చేయటం సరికాదన్నారు. సీఎం వ్యాఖ్యలు బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరగొద్దనేలా ఉన్నాయని విమర్శించారు. కేసీఆర్ వ్యాఖ్యలతో బడుగు బలహీనవర్గాలపై కేసీఆర్కున్న ద్వేషం బయటపడిందని అన్నారు. అందుకే సీఎం కేసీఆర్ అంబేద్కర్ జయంతి, వర్ధంతి కార్యక్రమాలకు హాజరుకారని బండి సంజయ్ ఆరోపించారు. 125 అడుగుల బాబా సాహెబ్ విగ్రహాన్ని నిర్మిస్తామని చెప్పిన కేసీఆర్ వ్యాఖ్యలు ఏమైపోయాయని విగ్రహాన్ని ఎందుకు నిర్మించలేదు అని ప్రశ్నించారు.

రాజ్యాంగం తిరిగి రాయాలన్న వ్యక్తి తెలంగాణ సీఎంగా ఎలా కొనసాగుతారని ప్రశ్నించారు. ఆయనపై దేశ ద్రోహం కేసు పెట్టాలని అన్నారు. కేసీఆర్ అంత అవినీతిపరుడు ఎవరూ ఉండరని విమర్శలు సంధించారు.కేసీఆర్ వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ నాయకులు రేపు ఉదయం నుంచి సాయంత్రం వరకు దీక్ష చేయనున్నట్లు బండి సంజయ్ ప్రకటించారు. తదుపరి కార్యాచరణను గురువారం ప్రకటిస్తామని చెప్పారు.