MAA Elections: ప్రకాశ్‌రాజ్ ఓటమిపై.. బండి సంజయ్ సంచలన ట్వీట్..!

మా.. ఎన్నికలు, ఫలితాల వ్యవహారంపై.. మాటల మంటలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా.. ఈ విషయంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఎంట్రీ ఇచ్చారు.

MAA Elections: ప్రకాశ్‌రాజ్ ఓటమిపై.. బండి సంజయ్ సంచలన ట్వీట్..!

Bandi Sanjay

Updated On : October 11, 2021 / 12:03 PM IST

టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాయి. మంచు విష్ణు.. అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఇతర పదవులపైనా.. దాదాపుగా క్లారిటీ వచ్చేసింది. అయినా.. మా.. ఎన్నికలు, ఫలితాల వ్యవహారంపై.. మాటల మంటలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా.. ఈ విషయంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఎంట్రీ ఇచ్చారు. మా.. ఎన్నికల్లో విజేతలకు కంగ్రాట్స్ చెబుతూ ట్వీట్ చేశారు.

అక్కడితో ఆగకుండా.. మంచు విష్ణు విజయం, ప్రకాశ్‌రాజ్ పరాజయాలను ఉద్దేశించి సంజయ్… సంచలన కామెంట్లు చేశారు. జాతీయ వాద వ్యతిరేక శక్తులను చిత్తుగా ఓడించిన మా సభ్యులకు ధన్యవాదాలు అంటూ.. ట్వీట్ చేసి వార్తల్లో నిలిచారు.

మా.. ఓటర్లు స్ఫూర్తి దాయకమైన తీర్పు ఇచ్చారని.. అందరికీ అభినందనలు భారత్ మాతా కీ జై.. అంటూ బండి సంజయ్ ట్వీట్ చేశారు. ఈ విషయమై.. ప్రకాశ్‌రాజ్ స్పందించారు. మా.. సభ్యత్వానికి రాజీనామా చేస్తానని వెల్లడించిన సందర్భంగా ఆయన బండి సంజయ్ ట్వీట్ ను ప్రస్తావించారు. సంజయ్ కు కృతజ్ఞతలని అన్నారు.