Black Widow – Fast & Furious : అదరగొడుతున్న ‘బ్లాక్ విడో’ – ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 9’ లేటెస్ట్ ట్రైలర్స్..

స్కార్లెట్ జాన్సన్ ప్రధానపాత్రలో నటించిన ‘బ్లాక్ విడో’ జూలై 9న వరల్డ్‌వైడ్ గ్రాండ్‌గా రిలీజబోతోంది. ఈ నేపథ్యంలో రీసెంట్‌గా తెలుగు ట్రైలర్ రిలీజ్ చేశారు. క్లుప్తంగా కథ చెప్తూ సాగిన ఈ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది..

Black Widow – Fast & Furious : అదరగొడుతున్న ‘బ్లాక్ విడో’ – ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 9’ లేటెస్ట్ ట్రైలర్స్..

Black Widow And Fast Furious 9 New Trailers

Updated On : April 15, 2021 / 6:30 PM IST

Black Widow – Fast & Furious: స్కార్లెట్ జాన్సన్ ప్రధానపాత్రలో నటించిన ‘బ్లాక్ విడో’ జూలై 9న వరల్డ్‌వైడ్ గ్రాండ్‌గా రిలీజబోతోంది. ఈ నేపథ్యంలో రీసెంట్‌గా తెలుగు ట్రైలర్ రిలీజ్ చేశారు. క్లుప్తంగా కథ చెప్తూ సాగిన ఈ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

కేట్ షార్ట్‌లాండ్ డైరెక్షన్లో మార్వెల్ స్టూడియోస్ సంస్థ భారీ బడ్జెట్‌తో ప్రెస్టీజియస్‌గా ప్రొడ్యూస్ చేసిన ‘బ్లాక్ విడో’ లో ఫ్లోరెన్స్ పగ్, డేవిడ్ హార్బర్ కీలకపాత్రల్లో నటించారు. ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళ్, కన్నడ మరియు మలయాళ భాషల్లో ఈ మూవీ భారీస్థాయిలో విడుదల కానుంది.

వరల్డ్ వైడ్‌గా మూవీ లవర్స్‌ని మరింత ఎంటర్‌టైన్ చెయ్యడానికి ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’ ఫ్రాంచైజ్‌లో వస్తున్న అడ్వంచరస్ అండ్ మోస్ట్ అవైటెడ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 9 – ది ఫాస్ట్ సాగా’.. విన్ డీజిల్, మిచెల్ రోడ్రిగెజ్, టైరెస్ గిబ్సన్ తదితరలు కీలకపాత్రల్లో నటించిన ఈ మూవీ సెకండ్ ట్రైలర్ వదిలారు. గూస్ బంప్స్ తెప్పించే యాక్షన్ ఎపిసోడ్స్‌తో ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 9’ (ఎఫ్ 9) ట్రైలర్ అదిరిపోయింది. ఈ ఏడాదిలోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు..