Top Headlines : ఢిల్లీలో ప్రమాదకర స్థాయికి చేరిన కాలుష్యం.. తుపానుగా మారనున్న తీవ్ర వాయుగుండం
ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఉత్తరకాశిలో ఉన్న టన్నెల్ ప్రమాదం అనంతరం చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్‌కు ఆటంకాలు ఎదురువుతున్నాయి. సహాయక చర్యలు చేస్తుండగానే కొండ చరియలు విరిగిపడుతున్నాయి. ఇంకా కొంతమంది కార్మికులు సొరంగంలోనే ఉన్నారు.

HeadLines
ఓటేద్దాం..
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో పోలింగ్ కొనసాగుతోంది. ఒకే విడతలో 230 స్థానాలకు ఇక్కడ ఎన్నికలు జరుగుతున్నాయి. మరోవైపు ఛత్తీస్‌గఢ్‌లో 2వ విడత పోలింగ్ కొనసాగుతోంది. ఓటు వేసేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
అగ్రనేతల ప్రచారం ..
నేడు కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లిఖార్జున ఖర్గేలు తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గోనున్నారు. ఐదు నియోజకవర్గాల్లో వీరు సుడిగాలి ప్రచారం నిర్వహిస్తారు.
హస్తం వరాలు..
నేడు కాంగ్రెస్ మ్యానిఫెస్టో రిలీజ్ కానుంది. గెలుపే లక్ష్యంగా పలు పథకాలతో కాంగ్రెస్ మ్యానిఫెస్టోను రూపకల్పన చేసినట్లు తెలిసింది. ఈ మ్యానిఫెస్టోను కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే విడుదల చేయనున్నారు.
తుపాను గండం ..
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండం మారింది. ఇది మరింత బలపడి వచ్చే 12 గంటల వ్యవధిలో తుఫాన్‌గా మారనుంది. దీని ప్రభావంతో ఏపీ సహా తీర ప్రాంత రాష్ట్రాలైన ఒడిశా, పశ్చిమ బెంగాల్ లోని పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేసింది.
సొరంగంలో ప్రాణాలు ..
ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఉత్తరకాశిలో ఉన్న టన్నెల్ ప్రమాదం అనంతరం చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్‌కు ఆటంకాలు ఎదురువుతున్నాయి. సహాయక చర్యలు చేస్తుండగానే కొండ చరియలు విరిగిపడుతున్నాయి. ఇంకా కొంతమంది కార్మికులు సొరంగంలోనే ఉన్నారు.
కట్టడి ఎలా?
దేశ రాజధానిలో కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరింది. పొగమంచు ప్రభావంతో 500 మీటర్లుకు విజిబులిటీ పడిపోయింది. మరోవైపు కేంద్రం రూపొందించిన వాయు కాలుష్య నియంత్రణ ప్రణాళిక ‘గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్‌ను పకడ్బందీగా అమలు చేసేందుకు ఢిల్లీ ప్రభుత్వం ముందుకొచ్చింది. ఆరుగురు సభ్యులతో కూడిన ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసినట్లు ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్ తెలిపారు.
రోడ్ టెర్రర్ ..
జింబాబ్వేలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ట్రక్కును మినీబస్సు బస్సు ఢీకొట్టడంతో 22 మంది మృతి చెందారు.
బిగ్ ఫైట్ ..
వన్డే ప్రపంచ కప్ ఫైనల్ ఫైట్ ఈనెల 19న భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగనుంది. ఇందుకు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికకానుంది. లక్షా 32 వేల మంది కెపాసిటి గల ఈ స్టేడియం ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ మైదానంగా రికార్డ్‌కెక్కింది. వరల్డ్ బిగ్గెస్ట్ స్టేడియంలో బిగ్గెస్ట్ మ్యాచ్ జరగబోతోంది. ఈసారి కప్‌ను ఎవరు కైవసం చేసుకుంటారన్నది ఇంట్రెస్టింగ్‌గా మారింది. ఇదిలాఉంటే గురువారం జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ లో సౌతాఫ్రికాపై ఆసీస్ విజయం సాధించింది.