Bride refuses to marry : పెళ్లి వద్దంటూ పీటలపై మొండికేసిన వధువు.. కారణం పెళ్లికొడుకు….

కాసేపట్లో పెళ్లికూతురు మెడలో మూడు ముళ్లు పడతాయి. అంతలోనే పెళ్లికూతురు పెళ్లి వద్దంటూ మొండికేసింది. పెళ్లికొడుకు తనకి నచ్చలేదని బలవంతం చేస్తే ఆత్మహత్య చేసుకుంటానని వార్నింగ్ ఇచ్చింది. ఇక ఆ పెళ్లి జరిగిందా?

Bride refuses to marry : పెళ్లి వద్దంటూ పీటలపై మొండికేసిన వధువు.. కారణం పెళ్లికొడుకు….

Bihar news

Updated On : May 18, 2023 / 4:53 PM IST

Bihar news : పెళ్లి ముహూర్తం దగ్గరపడింది. కాసేపట్లో వధువు మెడలో మూడు ముళ్లు పడే ఘడియ. అంతోనే పెళ్లికూతురు ఈ పెళ్లి వద్దని మొండికేసింది. కారణం తెలిసిన పెళ్లివారు అవాక్కయ్యారు.

Bride final warning : వరమాల వేసేముందు పెళ్లికొడుక్కి పెళ్లికూతురు ఇచ్చిన ఫైనల్ వార్నింగ్.. ఏమై ఉంటుంది..?

బీహార్ బాగల్‌పుర్‌లో కహల్‌గావ్‌లో ఓ పెళ్లి వేడుక మొదలైంది. ఆడ,మగ పెళ్లివారు సందడి చేస్తున్నారు. వరుడు ఊరేగింపుగా వేదిక వద్దకు చేరుకున్నాడు. అతడిని చూసిన వధువు ఒక్కసారిగా షాకయ్యింది. వరుడి మెడలో దండ వేసి.. తిలకం పెట్టేందుకు ససేమిరా అంది. పెళ్లికొడుకు నల్లగా ఉన్నాడని, వయసులో కూడా చూడటానికి తనకన్నా పెద్దగా ఉన్నాడని ఈ పెళ్లి చేసుకోనని మొండికేసింది. ఇక పీటలపై పెళ్లి ఆగిపోతే అవమానమే కదా.. మగపెళ్లివారు ఆమెను ఒప్పించడానికి నానా తంటాలు పడ్డారు. చాలా హామీలు కూడా ఇచ్చారు. బలవంతంగా ఈ పెళ్లి చేస్తే ఆత్మహత్య చేసుకుంటానని పెళ్లికూతురు స్పష్టం చేసింది.

Viral Video: చాక్లెట్ల జడతో అలంకరించుకున్న పెళ్లి కూతురు.. చాక్లెట్లతోనే నగలు.. వైరల్ అవుతున్న వీడియో

ఇక అంత మాట అన్నాక మగ పెళ్లివారే వారే వెనక్కి తగ్గాల్సి వచ్చింది. పెళ్లి రద్దు చేసుకుని ఎక్కడివారు అక్కడికి సర్దుకున్నారు. అందుకే అంటారేమో పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయించబడతాయని.