Venkatesh Daggubati: సీనియర్ హీరోలలో బిజీ హీరో.. వరస సినిమాలతో వెంకీ జోరు!

చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున జాగ్రత్తగా కథల ఎంపికలో ఒకటికి పదిమార్లు అలోచించి సినిమాలు ఒకే చేస్తున్నారు. తన వయసుకే నప్పేలా.. తన స్థాయికి తగ్గకుండా ఉండేలా వచ్చిన పాత్రలను ఒకే చేసి ముందుకెళ్తున్నారు. కానీ వెంకీ మాత్రం మిగతా ముగ్గురు కంటే స్పీడుగా ఉన్నాడు.

Venkatesh Daggubati: సీనియర్ హీరోలలో బిజీ హీరో.. వరస సినిమాలతో వెంకీ జోరు!

Busy Hero Among Senior Heroes Venki Josh With Movies

Updated On : April 5, 2021 / 12:36 PM IST

Venkatesh Daggubati: ఇప్పుడంటే కుర్ర హీరోలు డజన్ల మంది వచ్చేసరికి కాస్త దూకుడు తగ్గించారు కానీ లేదంటే ఓ పదిహేనేళ్ల క్రితం వరకు నలుగురు హీరోలు తెలుగు సినిమా ఇండస్ట్రీని దున్నేశారు. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ ఈ నలుగురి కోసమే ఒకప్పుడు దర్శక, నిర్మాతలు కథలు పట్టుకొని కాల్షీట్స్ కోసం కాళ్ళు అరిగేలా తిరిగేవారు. ఇప్పుడు వయసు పెరగడం.. కథల ఎంపికలో జాగ్రత్తలు.. తగ్గిన మార్కెట్ దృష్ట్యా ఇప్పుడు ఈ నలుగురు ఆచితూచి సినిమాలు చేయాల్సిన పరిస్థితి. ఇటు చూస్తే సీనియర్ హీరోలు.. బడ్జెట్ భారీగానే ఉంటుంది. తేడా కొడితే నిర్మాత నిండా మునిగిపోతాడు. అందుకే కథల నుండి క్యాస్టింగ్ వారు అన్నీ ఆచితూచి ఎంచుకోవాలి.

అందుకే చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున జాగ్రత్తగా కథల ఎంపికలో ఒకటికి పదిమార్లు అలోచించి సినిమాలు ఒకే చేస్తున్నారు. తన వయసుకే నప్పేలా.. తన స్థాయికి తగ్గకుండా ఉండేలా వచ్చిన పాత్రలను ఒకే చేసి ముందుకెళ్తున్నారు. కానీ వెంకీ మాత్రం మిగతా ముగ్గురు కంటే స్పీడుగా ఉన్నాడు. సీతమ్మ వాకిట్లో నుండి కుర్రహీరోలతో కలిసి మల్టీస్టారర్ మొదలు పెట్టిన వెంకీ ఒకవైపు సోలో సినిమాలు.. రీమేకులతో పాటు ఛాన్స్ దొరికితే కుర్రహీరోలతో స్క్రీన్ షేర్ చేసుకొనేందుకు సిద్దమయ్యాడు. అందుకే వరసపెట్టి సినిమా చేస్తున్నాడు.

వచ్చే నాలుగు నెలల్లో వెంకీ నటించిన మూడు సినిమాలు విడుదలకు సిద్దమవుతున్నాయంటే మిగతా హీరోలకంటే వెంకీ ఏస్థాయిలో దూసుకుపోతున్నాడో అర్ధం చేసుకోవచ్చు. వెంకీ నటించిన రీమేక్ నారప్ప సినిమా మే 14న రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమా మీద కొంత అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. కాగా ఇప్పటికే మరో హీరో వరుజ్ తేజ్ తో కలిసి నటించిన సీక్వెల్ F3 సినిమాను ఆగస్ట్ 27న రిలీజ్ చేయబోతున్నట్లు దర్శక, నిర్మాతలు ఇప్పటికే ప్రకటించారు. మరోవైపు మలయాళం రీమేక్ సీక్వెల్ దృశ్యం-2 కూడా ముమ్మర షూటింగ్ లో ఉంది. ఎలాగైనా ఈ సినిమాను నారప్ప, F3 సినిమాల మధ్యలోని మూడు నెలల గ్యాప్ లో రిలీజ్ చేయాలని సన్నాహాలు చేస్తున్నారట. మొత్తంగా నాలుగు నెలలలో మూడు సినిమాలు రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేసుకున్న వెంకీ.. కుర్రహీరోలకు పోటీ ఇస్తున్నాడనే చెప్పుకోవాలి!