ఎస్పీ బాలుకి CMU నివాళి..

Cine Musicians Union Tribute To SPB: గాన గంధర్వులు, సంగీత జ్ఞాని ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతి సంగీత ప్రియులను, అభిమానులను ఎంతోగానో కలిచివేసింది. బాలు అకాల మరణం ఆయన సన్నిహితులను, ఆయనతో కలిసి పనిచేసిన వారిని తీరని శోకంలో ముంచెత్తింది. వారు ఇంకా షాక్ నుంచి తేరుకోలేకపోతున్నారు.
మంగళవారం బాలుకి నివాళులర్పించేందుకు హైదరాబాద్ సినీ మ్యూజీషియన్స్ యూనియన్ (CMU) వారు శ్రద్ధాంజలి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కరోనా పరిస్థితుల కారణంగా సాధారణ స్థాయిలోనే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. పలువురు ప్రముఖులు జూమ్ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.