పడకగదిలో శృంగారంపై లాక్‌డౌన్ ప్రభావం..?

లాక్ డౌన్ ప్రారంభమైనప్పటి నుండి మీ సెక్స్ డ్రైవ్‌లో మార్పును మీరు గమనించారా? మీరు మాత్రమే కాదు. కరోనా మహమ్మారి ప్రభావంతో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతోంది. ప్రతిఒక్కరి జీవనశైలిలో భౌతిక దూరం తప్పనిసరిగా మారింది. దీని ఫలితంగా చాలామందిలో లైంగిక కోరికలపై తీవ్ర ప్రభావం చూపుతోందని Lovehoney లోని సెక్స్ అండ్ రిలేషన్ నిపుణుడు Annabelle Knight అన్నారు. కరోనా వైరస్ ప్రారంభం నుంచి ఒత్తిడి కారణంగా సాధారణంగా కంటే తక్కువగా లైంగిక కోరికలతో అనుభూతి చెందుతున్నారు.
మీ లైంగిక జీవితంపై ఆందోళన ప్రభావంతో తక్కువ కోరికలు, లేదా సెక్స్ చేయాలనే కోరిక సన్నగిల్లుతోందన్నారు. కార్టిసాల్ (cortisol) అధిక స్థాయి ఆందోళన, ఒత్తిడి భావోద్వేగాలతో సంబంధం కలిగి ఉంటుంది. అధిక కార్టిసాల్ కోరికను ప్రభావితం చేసే సెక్స్ హార్మోన్లను అణిచివేస్తుంది. ఆందోళనగా ఉన్నప్పుడు శృంగారంలో పాల్గొనడం కష్టం. ఆందోళన, లైంగిక చర్యతో మీరు మానసిక స్థితి గతితప్పుడాన్ని చూసి ఆశ్చర్యపోనవసరం లేదు.
కౌన్సెలింగ్ డైరెక్టరీ సభ్యుడు Monika Dedus ప్రకారం.. లాక్‌డౌన్‌లో లైంగిక కోరిక మార్పు నుంచి మినహాయింపు లేదని జంటలు చెప్పారని తెలిపారు. ‘వ్యక్తిగతంగా కాకుండా చాలా మంది జంటలను కలిసి థెరీపీ సలహా కోరుతున్నాను. లాక్‌డౌన్ వల్ల చాలామంది జంటలు వ్యక్తిగత, వృత్తిపరమైన ఒత్తిళ్లతో పాటు మానసిక ఆరోగ్య సమస్యలకు కారణమవుతోంది. 24/7 ఒకే చోట నివసించడం కూడా వారిలో సాన్నిహిత్యం సమస్యలను ఎదుర్కొంటున్నారు. కొన్ని జంటలకు, మొదటి రెండు వారాలు కలిసి ఉండి, లైంగిక కోరికలు పెరగడంతో హాలీడేలా అనిపించింది. అయితే, కొంతమందికి త్వరలోనే ‘గ్రౌండ్‌హాగ్ డే ఫీలింగ్’గా మారిపోయింది. సాన్నిహిత్యం, సెక్స్ కోరికలు గణనీయంగా తగ్గి ఉండవచ్చు’ అని అభిప్రాయపడ్డారు.
అందరు వ్యక్తులు ఒకేలా ఉండరు. చాలా మంది లైంగిక చర్యను ఒత్తిడి నుంచి బయటకు పడేందుకు ప్రయత్నిస్తుంటారు. లాక్‌డౌన్ ఒత్తిడితో కూడిన సమయంలో ఎక్కువ హస్త ప్రయోగం చేస్తారు. పూర్తి లైంగిక చర్యలో పాల్గొంటారు. లైంగిక ప్రేరేపణతో ఆందోళనను నివారించుకోవచ్చు. కౌన్సెలింగ్ డైరెక్టరీ సభ్యుడు Beverley Hills
మాట్లాడుతూ.. ఒత్తిడి ఉపశమనం విషయానికి వస్తే భావప్రాప్తికి కెమికల్ బెనిఫిట్ ఉందని చెప్పారు. అసురక్షిత సమయాల్లో మన ఆందోళనల నుండి తప్పించుకోవడానికి మనం మనస్సును స్వయంగా ప్రశాంతపరుచుకుంటామని తెలిపారు. ఉద్వేగం మెదడులో ఎండార్ఫిన్‌లను ప్రేరేపించడం ద్వారా ఒత్తిడిని తగ్గిస్తుందన్నారు. శరీరంలో సానుకూల భావనకు దారితీస్తుందని హిల్స్ వివరించారు.