Couple Dance Viral : ‘అంగ్ లగా దే’ పాటకు కపుల్ డ్యాన్స్ అదుర్స్

సోషల్ మీడియా పుణ్యమా అని ప్రతిభావంతులంతా బయటకు వస్తున్నారు. చాలామంది టాలెంట్‌కి ఇంటర్నెట్ వేదికగా మారింది. తాజాగా ఓ జంట చేసిన డ్యాన్స్ అందర్నీ మెస్మరైజ్ చేసింది.

Couple Dance Viral : ‘అంగ్ లగా దే’ పాటకు కపుల్ డ్యాన్స్ అదుర్స్

గత ఏడాది

Updated On : June 1, 2023 / 2:44 PM IST

Viral Video : సోషల్ మీడియాలో హిట్ సాంగ్స్‌కి డ్యాన్సులు చేసి వైరల్ అవ్వడం కామన్ అయిపోయింది. అయితే అందులో కొన్ని పాటలకు వేసే స్టెప్పులు దుమ్ము లేపుతున్నాయి. రామ్-లీలా సినిమాలోని అంగ్ లగా దే పాటకు ఓ జంట వేసిన అందమైన స్టెప్పులు అదరహో అనిపిస్తున్నాయి.

Woman Dance : ఇమ్రాన్ హష్మీ ,సన్నీ లియోన్‌ల ‘పియా మోర్’ పాటకు ఓ యువతి చేసిన మైండ్ బ్లోయింగ్ డ్యాన్స్

ఈ మధ్య కాలంలో చాలామంది ప్రతిభావంతులు బయటకు వస్తున్నారు. ఇంతమంది నైపుణ్యం ఉన్న వారు ఉన్నారా? అని ఆశ్చర్యం వేస్తోంది. సోషల్ మీడియా ప్రతిభ ఉన్నవారికి మంచి వేదికగా మారింది. చాలా హిట్ సాంగ్స్‌కి సోలోగా, జంటగా డ్యాన్స్ వీడియోలు చేస్తున్నారు. అందులో కొన్ని మిలియన్ల వ్యూస్‌తో దూసుకుపోతున్నవి ఉన్నాయి. అలాంటి క్లిప్‌ల మధ్య మరో డ్యాన్స్ వీడియో వైరల్ అవుతోంది. రామ్-లీలా సినిమాలోని ‘అంగ్ లగా దే’ పాట ఎంత సూపర్ హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఈ పాటను అదితి పాల్ మరియు షైల్ హడా పాడారు.

Viral Video : అమేజింగ్ టాలెంట్.. డ్యాన్స్ ఇరగదీసిన టీచర్.. వీడియో వైరల్

ఇన్‌స్టాగ్రామ్‌లో డ్యాన్సర్ ఇషా శర్మ _.isha._sharma ఈ వీడియోని షేర్ చేశారు. ఓ జంట స్టూడియోలో నిలబ్డడారు. మరికొందరు వారికి చుట్టూ ఉన్నారు. పాట మొదలు కాగానే బీట్‌కి తగ్గట్లు స్టెప్పులు వేసి అందర్నీ మెస్మరైజ్ చేశారు. ‘పాట నేర్పినందుకు ధన్యవాదాలు’ అని.. ‘బృందావనంలో రాధలా ఉన్నారు’ అంటూ వీడియోపై ప్రశంసలు కురిపించారు.

 

View this post on Instagram

 

A post shared by Isha Sharma (@_.isha._sharma)