Woman Dance : ఇమ్రాన్ హష్మీ ,సన్నీ లియోన్‌ల ‘పియా మోర్’ పాటకు ఓ యువతి చేసిన మైండ్ బ్లోయింగ్ డ్యాన్స్

2017 లో ఇమ్రాన్ హష్మీ, సన్నీ లియోన్ జంటగా నటించిన 'బాద్ షాహో' సినిమాలోని 'పియా మోర్' పాట మళ్లీ వైరల్ అవుతోంది. కారణం ఈ పాటకి వర్తికా ఝా అనే డ్యాన్సర్ వేసి స్టెప్పులు .. నెటిజన్లు డ్యాన్స్ అదరహో అని ప్రశంసలు కురిపిస్తున్నారు.

Woman Dance : ఇమ్రాన్ హష్మీ ,సన్నీ లియోన్‌ల ‘పియా మోర్’ పాటకు ఓ యువతి చేసిన మైండ్ బ్లోయింగ్ డ్యాన్స్

Woman mind blowing dance

Woman Dance – Viral Video : సోషల్ మీడియా పుణ్యమా అని ఎంతోమంది టాలెంట్ ఉన్న యంగ్ స్టర్స్ బయటకు వస్తున్నారు. రీసెంట్‌గా ‘పియా మోర్’ బీట్‌కు ఓ యువతి చేసిన డ్యాన్స్ వైరల్ అవుతోంది.

Great Father : కూతురి కోసం ఎంత కష్టమైనా సరే.. స్కూల్ ఈవెంట్‌లో వీల్ ఛైర్‌పై కూర్చుని డాన్స్ చేసిన తండ్రి

2017 లో ఇమ్రాన్ హష్మీ, సన్నీ లియోన్‌లు జంటగా వచ్చిన ‘బాద్ షాహో’ సినిమా గుర్తుంది కదా.. ఈ సినిమాలో ‘పియా మోర్’ పాటను అస్సలు మర్చిపోలేం. మికా సింగ్, నీతి మోహన్ ఈ పాటను పాడారు. మనోజ్ ముంతాషిర్ సాహిత్యం అందించిన ఈ పాటకు అంకిత్ తివారీ మ్యూజిక్ కంపోజ్ చేశారు. ఈ పాట వివరాలు ఇప్పుడు ఎందుకంటే ఈ పాటకు ప్రముఖ డ్యాన్సర్ ‘వర్తికా ఝా’ అద్భుతంగా డ్యాన్స్ చేశారు. స్టైలిష్ క్రాప్ టాప్‌లో బ్యాగీ జీన్స్ వేసుకుని ‘పియా మోర్’ పాటకు ఆమె వేసిన స్టెప్పులు అదరహో అన్నట్లు ఉన్నాయి. jhavartika పేరుతో ఉన్న తన సొంత ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్ లో వర్తికా షేర్ చేసిన ఈ డ్యాన్స్ వీడియో వైరల్ అవుతోంది.

Madhya Pradesh: ఆనందంగా డాన్స్ చేశారు.. ఉద్యోగం పోగొట్టుకున్నారు.. టెంపుల్‌లో డాన్స్ చేసినందుకు జాబ్ కోల్పోయిన మహిళలు

వర్తికా ఝా “పియా మోర్ బోలే బోలే” అనే క్యాప్షన్‌తో వీడియోను పంచుకున్నారు. ఇక ఈ వీడియో చూసిన యూజర్లు ‘ఏమి ఎనర్జీ.. మైండ్ బ్లోయింగ్’ అని.. ‘మీ డ్యాన్స్ వీడియోల్లో బెస్ట్ వీడియో’ అని కామెంట్లు పెడుతున్నారు. కొన్ని పాత సినిమా పాటలు కూడా ఇలాంటి కళాకారుల వల్ల మళ్లీ బయటకు వచ్చి అందర్నీ అలరిస్తున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by vartika jha (@jhavartika)