Madhya Pradesh: ఆనందంగా డాన్స్ చేశారు.. ఉద్యోగం పోగొట్టుకున్నారు.. టెంపుల్‌లో డాన్స్ చేసినందుకు జాబ్ కోల్పోయిన మహిళలు

దేవాలయంలో డాన్స్ చేయకూడదనే సంగతి తెలిసిందే. అయినప్పటికీ కొందరు దేవాలయాల్లో అనవసర వీడియోలు తీసుకుంటూ విమర్శల పాలవుతున్నారు. తాజాగా ఇద్దరు మహిళలు ఉద్యోగం పోగొట్టుకున్నారు.

Madhya Pradesh: ఆనందంగా డాన్స్ చేశారు.. ఉద్యోగం పోగొట్టుకున్నారు.. టెంపుల్‌లో డాన్స్ చేసినందుకు జాబ్ కోల్పోయిన మహిళలు

Madhya Pradesh: పవిత్రమైన దేవాలయాల్లో సినిమా పాటలకు డాన్స్ చేయకూడదనే సంగతి తెలిసిందే. అయితే, మధ్య ప్రదేశ్‌లో మాత్రం ఇద్దరు మహిళలు పవిత్రమైన మహాకాళ్ దేవాలయంలో డాన్స్ చేశారు. అది కూడా మహిళా భద్రతా సిబ్బంది. దీనిపై స్పందించిన ఆలయ అధికారులు ఇద్దరినీ సస్పెండ్ చేశారు.

Andhra Pradesh: పుంగనూరులో పారిశ్రామిక వేత్త ఇంటిపై దాడి.. రాళ్లు, కర్రలతో అర్ధరాత్రి దుండగుల వీరంగం

మధ్య ప్రదేశ్, ఉజ్జైన్ జిల్లాలో ప్రసిద్ధ మహాకాళ్ దేవాలయం ఉంది. ఇక్కడ ఇద్దరు మహిళలు భద్రతా విభాగంలో పని చేస్తున్నారు. అయితే, భక్తులు పెద్దగా లేకపోవడం, ఖాళీగా ఉండటం వల్లో కానీ… ఆ ఇద్దరూ దేవాలయంలోనే వీడియో తీసుకోవాలి అనుకున్నారు. సోషల్ మీడియాలో పోస్ట్ చేసే ఉద్దేశంతో బాలీవుడ్ సినిమా పాటకు సరదాగా డాన్స్ చేస్తూ వీడియో తీసుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. కానీ, చాలా మంది భక్తుల ఆగ్రహానికి కూడా గురైంది. పవిత్రమైన దేవాలయంలో ఇలా డాన్స్ చేయడం ఏంటని నెటిజన్లు ప్రశ్నించారు. దీనిపై విమర్శలు రావడంతో ఆలయ అధికారులు స్పందించారు.

వెంటనే ఇద్దరు మహిళల్ని విధుల్లోంచి తొలగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ ఘటన నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. ఇకపై ఆలయంలోకి మొబైల్ ఫోన్లు, కెమెరాలు వంటివి తీసుకెళ్లకుండా నిషేధం విధించారు.