Andhra Pradesh: పుంగనూరులో పారిశ్రామిక వేత్త ఇంటిపై దాడి.. రాళ్లు, కర్రలతో అర్ధరాత్రి దుండగుల వీరంగం

చిత్తూరు జిల్లా పుంగనూరులో ఆదివారం అర్ధరాత్రి ఉద్రిక్తత చోటు చేసుకుంది. పారిశ్రామికవేత్త రామచంద్ర యాదవ్ ఇంట్లోకొ చొచ్చుకెళ్లిన కొందరు దండగులు దాడికి పాల్పడ్డారు.

Andhra Pradesh: పుంగనూరులో పారిశ్రామిక వేత్త ఇంటిపై దాడి.. రాళ్లు, కర్రలతో అర్ధరాత్రి దుండగుల వీరంగం

Andhra Pradesh: ఏపీ, చిత్తూరు జిల్లా, పుంగనూరులో ఆదివారం అర్ధరాత్రి కొందరు దుండగులు వీరంగం సృష్టించారు. పారిశ్రామిక వేత్త రామచంద్ర యాదవ్ ఇంటిపై కొందరు దాడికి పాల్పడ్డారు. ఇంట్లోకి చొరబడి అద్దాలు, ఫర్నీచర్‌తోపాటు ఆరు కార్లను ధ్వంసం చేశారు.

Gujarat Election: నేడు గుజరాత్ రెండో దశ ఎన్నికల పోలింగ్.. 93 స్థానాలకు ఎన్నిక

కాగా, ఘటన సమాచారం అందుకున్న పోలీసులు రామచంద్ర యాదవ్ ఇంటికి చేరుకుని లాఠీఛార్జి చేసి, నిందితుల్ని చెదరగొట్టారు. ఈ ఘటనలో పోలీసుల తీరుపై రామచంద్ర యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడి జరుగుతుంటే పోలీసులు అడ్డుకోలేదని ఆరోపించారు. ఈ దాడికి రాజకీయాలే కారణమని తెలుస్తోంది. అధికార వైసీపీకి చెందిన శ్రేణులే దాడికి పాల్పడ్డట్లు సమాచారం. పుంగనూరు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం. అయితే, ఈ నియోజకవర్గంలో రామచంద్ర యాదవ్ ఆధ్వర్యంలో రైతుల సమస్యలపై తలపెట్టిన ‘రైతు భేరి’కి అనుమతి లేదని ఆదివారం పోలీసులు అడ్డుకున్నారు.

Rahul Gandhi: గిరిజనులతో కలిసి ఉత్సాహంగా డ్యాన్స్ చేసిన రాహుల్, సీఎం గెహ్లాట్.. వీడియో వైరల్

ఈ నేపథ్యంలో ఈ సభ అధికార పార్టీకి వ్యతిరేకంగా జరుగోందని, వైసీపీ నేతలు అర్ధరాత్రి ఈ దాడికి పాల్పడ్డట్లు సమాచారం. ఈ దాడిలో దాదాపు 200 మంది పాల్గొన్నారని రామచంద్ర యాదవ్ అనుచరులు అంటున్నారు. పోలీసులతోపాటు అదనపు బలగాలు కూడా స్పందించడంతో ఈ దాడి ఆగింది.