Gujarat Election: నేడు గుజరాత్ రెండో దశ ఎన్నికల పోలింగ్.. 93 స్థానాలకు ఎన్నిక

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో నేడు రెండో దశ పోలింగ్ జరగనుంది. 14 జిల్లాల్లోని 93 అసెంబ్లీ స్థానాలకు నేడు ఎన్నిక జరుగుతుంది. 2.5 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు వేయనున్నారు.

Gujarat Election: నేడు గుజరాత్ రెండో దశ ఎన్నికల పోలింగ్.. 93 స్థానాలకు ఎన్నిక

Gujarat Election: గుజరాత్ అసెంబ్లీకి నేడు రెండో దశ పోలింగ్ జరగనుంది. సోమవారం 14 జిల్లాల్లో 93 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. 2.5 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. రెండో దశలో మొత్తం 833 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు.

Volcano Erupted: ఇండోనేషియాలో బద్దలైన ఎత్తైన అగ్నిపర్వతం.. సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్న ప్రజలు

వీరిలో 764 మంది పురుష అభ్యర్థులుకాగా, 69 మంది మహిళలు ఉన్నారు. 285మంది స్వతంత్ర అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఈ ఎన్నిక ప్రధానంగా బీజేపీ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య సాగుతుంది. రెండో దశలో కీలక స్థానాలైన అహ్మదాబాద్, వడోదర, గాంధీనగర్ వంటి నియోజకవర్గాలున్నాయి. ఈ నెల 1న మొదటి దశ ఎన్నిక జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికలో 63.31 శాతం ఓటింగ్ మాత్రమే నమోదైంది. రెండో దశ ఎన్నిక కోసం 26,409 పోలింగ్ స్టేషన్లను ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. 29,000 ప్రిసైడింగ్ ఆఫీసర్లు, 84,000 వరకు పోలింగ్ ఆఫీసర్లు విధులు నిర్వహిస్తున్నారు.

అలాగే 36,000 ఈవీఎంలను అధికారులు సిద్ధం చేశారు. ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. ఈ నెల 8న ఫలితాలు విడుదలవుతాయి.