BJP Ticket: ఒకే సీటు కోసం భార్యాభర్తల పంతం.. యూపీ బీజేపీకి తలనొప్పి

సిట్టింగ్ ఎమ్మెల్యే, బీజేపీ మంత్రి అయిన స్వాతి సింగ్, యూపీ బీజేపీ వైస్ ప్రెసిడెంట్ అయిన ఆమె భర్త దయాశంకర్ సింగ్ ఒకే సీటు నుంచి పోటీ చేసేందుకు ఒకే పార్టీ నుంచి ఒక్క టికెట్ కోసం...

BJP Ticket: ఒకే సీటు కోసం భార్యాభర్తల పంతం.. యూపీ బీజేపీకి తలనొప్పి

Bjp Seat

Updated On : January 19, 2022 / 11:15 AM IST

BJP Ticket: సిట్టింగ్ ఎమ్మెల్యే, బీజేపీ మంత్రి అయిన స్వాతి సింగ్, యూపీ బీజేపీ వైస్ ప్రెసిడెంట్ అయిన ఆమె భర్త దయాశంకర్ సింగ్ ఒకే సీటు నుంచి పోటీ చేసేందుకు ఒకే పార్టీ నుంచి ఒక్క టికెట్ కోసం తలపడుతున్నారు. దీంతో నియోజకవర్గ ఎన్నికల పోటీ వారి ఇంటి నుంచి మొదలైనట్లుగా మారింది. లక్నో జిల్లాలో సరోజినీ నగర్ నుంచి పోటీ చేసేందుకు పార్టీ ఏ ఒక్కరికో మాత్రమే టిక్కెట్ కేటాయించాల్సి ఉంది.

ప్రస్తుతం స్వాతి సింగ్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఆ నియోజకవర్గంలో నాలుగో దశ ఎన్నికల్లో భాగంగా ఫిబ్రవరి 23న ఎన్నికలు జరగనున్నాయి.

మరోవైపు దయాశంకర్ పై 2016నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బీఎస్పీ లీడర్లు, మాయావతి రాజ్యసభలో అతని ప్రస్తావన తెచ్చి ఆరోపణలు గుప్పించారు. దీంతో బీజేపీ దయాశంకర్ ను సస్పెండ్ చేసింది. కొద్ది రోజులకే మౌ ప్రాంతంలో అరెస్టు అయ్యారు.

ఇది కూడా చదవండి : సెంట్రల్ రైల్వేలో 2422 అప్రెంటిస్ ల భర్తీ

2017ఎన్నికల్లో స్వాతి సింగ్ ను యోగి కేబినెట్ లోకి తీసుకున్నారు. ఆమె భర్త సస్పెన్షన్ ను రద్దు చేశారు.  ఆ తర్వాత రియల్ ఎస్టేట్ వ్యక్తితో మాట్లాడిన ఫోన్ కాల్ వైరల్ అవడంతో ఆమెపై ఎఫ్ఐఆర్ నమోదైంది. సీఎం యోగి ఆదిత్యనాథ్ ఈ విషయంలో ఆమెపై సీరియస్ అయ్యారు.