Central Railway Recruitment 2022 : సెంట్రల్ రైల్వేలో 2422 అప్రెంటిస్ ల భర్తీ

అప్రంటీస్ అర్హత విషయానికి వస్తే అభ్యర్ధులు పదో తరగతి, సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.

Central Railway Recruitment 2022 : సెంట్రల్ రైల్వేలో 2422 అప్రెంటిస్ ల భర్తీ

Mumbai Central

Updated On : January 19, 2022 / 11:27 AM IST

Central Railway Recruitment 2022 : భారత ప్రభుత్వ రైల్వే మంత్రి త్వ శాఖకు చెందిన ముంబైలోని సెంట్రల్ రైల్వే లో వివిధ ట్రేడుల్లో అప్రెంటిస్ ల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, మెకానికి్ డీజిల్, కార్పెంటర్, పెయింటర్, వెల్డర్, ఇన్ స్టుంమెంట్ మెకానిక్, ల్యాబోరేటరీ అసిస్టెంట్, టర్నర్, షీట్ మెటల్ వర్కర్ , కంప్యూటర్ ఆపరేషన్ తదితర ట్రేడుల్లో అప్రెంటీస్ ఖాళీలు ఉన్నాయి.

అప్రంటీస్ అర్హత విషయానికి వస్తే అభ్యర్ధులు పదో తరగతి, సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్ధుల వయస్సు జనవరి 17 నాటికి 15 ఏళ్ల నుండి 24 ఏళ్ల మధ్య ఉండాలి. పదోతరగతి, ఐటీఐ లో వచ్చిన మెరిట్ మార్కుల అధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

అభ్యర్ధులు తమ దరఖాస్తులను ఆన్ లైన్ లో పంపాల్సి ఉంటుంది. దరఖాస్తులకు చివరి తేది ఫిబ్రవరి 16గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ https://rrccr.com