Covaxin Vaccine: పిల్లలకు కొవాగ్జిన్ టీకా.. ట్రయల్స్ ఎప్పుడంటే?
కరోనా కట్టడికి సంజీవనిలా భావిస్తున్న వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతమైంది. ఇప్పటికే 18 ఏళ్ల పైబడిన వారందరికీ వ్యాక్సిన్ అందజేస్తుండగా.. వ్యాక్సిన్ అనుకున్న స్థాయిలో అందుబాటులో లేకపోవడంతో ఈ ప్రక్రియ వేగవంతమవుతుంది.

Covaxin Vaccine Children
Covaxin Vaccine: కరోనా కట్టడికి సంజీవనిలా భావిస్తున్న వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతమైంది. ఇప్పటికే 18 ఏళ్ల పైబడిన వారందరికీ వ్యాక్సిన్ అందజేస్తుండగా.. వ్యాక్సిన్ అనుకున్న స్థాయిలో అందుబాటులో లేకపోవడంతో ఈ ప్రక్రియ వేగవంతమవుతుంది. ఈ సమస్యను పరిష్కరించుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు వేగవంతం చేయగా వ్యాక్సిన్ కంపెనీలు కూడా సాధ్యమైనంతవరకు వ్యాక్సిన్ తయారీని వేగవంతం చేశారు.
అయితే, కరోనా సెకండ్‌వేవ్ వృద్ధులు, యువకులపైనే కాకుండా చిన్నపిల్లలపై కూడా దాడి చేస్తోంది. మరోవైపు థర్డ్ వేవ్ ముఖ్యంగా పిలల్లపైనే చూపేలా ఉందని నిపుణుల హెచ్చరికలతో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సహా పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పిల్లలకు కూడా వ్యాక్సిన్ ఇవ్వాలనే ఉద్దేశ్యంతో క్లినికల్ ట్రయల్స్ నిర్వహణ జరుగుతుంది. 2 నుంచి 18 సంవత్సరాల మధ్య వయస్సు గల పిల్లలపై ఇప్పటికే వ్యాక్సిన్ మొదటి దశ క్లినికల్ ట్రయల్స్ విజయవంతం కాగా, ఈ మధ్యనే రెండు, మూడో దశలలో ట్రయల్ కోసం భారత్ బయోటెక్‌కు చెందిన కోవాగ్జిన్ టీకా అనుమతి పొందింది.
ఇప్పటికే 525 మంది వాలంటీర్ల ఎంపిక మొదలు పెట్టిన కొవాగ్జిన్ రానున్న పది రోజులలోనే రెండు మూడు దశల క్లినికల్ ట్రయల్స్ మొదలుపెట్టనున్నట్లుగా తెలుస్తుంది. పాత కరోనా వేరియంట్ తో పాటు కొత్తగా పుట్టుకొచ్చిన వేరియంట్లను కూడా కొవాగ్జిన్ సమర్ధవంతంగా ఎదుర్కొంటుందనే తాజా నివేదికలతో పాటు ప్రపంచంలో సురక్షితమైన వ్యాక్సిన్ గా కొవాగ్జిన్ గుర్తింపు దక్కించుకోవడం.. ఇప్పుడు పిల్లలపై వ్యాక్సిన్ ప్రయోగాలు కూడా సమర్ధవంతంగానే ఉంటుందని భారత్ బయోటెక్ ఆశాభావం వ్యక్తం చేస్తుంది. ఇక ఈ మధ్య కాలంలో 12 సంతవ్సరాల లోపు పిల్లలకు కొవాగ్జిన్ అనుమతి లభించిందనే ప్రచారం జరగగా అది అబద్దపు ప్రచారంగా కంపెనీ కొట్టిపారేసింది. ఇప్పటి వరకు 18 ఏళ్ల పైబడిన వారికి మాత్రమే టీకా ఇస్తుండగా 2 నుండి 18 మధ్య వారిపై మరో పదిరోజులలో ట్రయల్స్ మొదలు కానున్నాయి.