Covid-19 Guidelines: పల్లెలు, పట్టణాలకు కేంద్రం కొత్త మార్గదర్శకాలు..!

దేశంలో కరోనా విస్తృత వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా నగరాలు, పట్టణాలలో ఈ వ్యాప్తి ఎక్కువగా ఉండగా సెమీ అర్బన్, పల్లెలలో కూడా స్వల్పంగా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం కరోనాను కంట్రోల్ చెయ్యడానికి ఎప్పటికప్పుడు కొత్త గైడ్‌లైన్స్ జారీ చేస్తోంది.

Covid-19 Guidelines: పల్లెలు, పట్టణాలకు కేంద్రం కొత్త మార్గదర్శకాలు..!

Covid 19 Guidelines Center For New Guidelines For Villages And Towns

Updated On : May 16, 2021 / 4:11 PM IST

Covid-19 Guidelines: దేశంలో కరోనా విస్తృత వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా నగరాలు, పట్టణాలలో ఈ వ్యాప్తి ఎక్కువగా ఉండగా సెమీ అర్బన్, పల్లెలలో కూడా స్వల్పంగా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం కరోనాను కంట్రోల్ చెయ్యడానికి ఎప్పటికప్పుడు కొత్త గైడ్‌లైన్స్ జారీ చేస్తోంది. ఈ క్రమంలోనే ఈసారి కేంద్రం పల్లెలు, పట్టణాల మీద దృష్టి తాజాగా మరోసారి మార్గదర్శకాలు ఇచ్చింది. గ్రామాల్లో హెల్త్ కమ్యూనిటీలు, ప్రైమరీ లెవెల్ హెల్త్ కేర్ వ్యవస్థను బలోపేతం చెయ్యాలని కేంద్రం కొత్త గైడ్‌లైన్స్ లో పేర్కొంది.

ఈ గైడ్ లైన్స్ ప్రకారం ప్రతి గ్రామంలో యాక్టివ్ సర్వేలెన్స్ వ్యవస్థను ఏర్పాటు చేసి కరోనా లక్షణాలు ఉన్నవారిని.. అనారోగ్యంతో ఉన్నవారిని గుర్తించాల్సి ఉంది. మరోవైపు కరోనా కంటైన్మెంట్, నిర్వహణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. దీని ప్రకారం గిరిజన, గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో కరోనా బాధితుల సేవలకు అవసరమైన సదుపాయాలు కల్పించాలని.. ముఖ్యం ఈ ప్రాంతాలలో తలెత్తే శ్వాస సమస్యలపై ప్రత్యేక నిఘా పెట్టాలని సూచించింది. ఇందుకోసం ఆశా వర్కర్లు, ఆరోగ్య కార్యకర్తలతో కరోనా పరిస్థితులను పర్యవేక్షించాలని కేంద్రం పేర్కొంది.

కరోనా లక్షణాలున్న వారికి టెలిమెడిసిన్ తో వైద్య సేవలు అందించాలని తెలిపింది. ఇందుకోసం గ్రామాల్లో ఆక్సిమీటర్లు, థర్మామీటర్లు అందుబాటులో ఉంచాలని పేర్కొంది. ఆక్సిమీటర్ ఉపయోగించిన ప్రతిసారి శానిటైజ్ చేయాలని.. ఆశా, అంగన్వాడీ, వాలంటీర్లతో ఈ సేవలు అందించాలని సూచించింది. కరోనా బాధితులకు హోమ్ ఐసోలేషన్ కిట్లు అందించి టెలీ చికిత్స అందించాలని సూచించింది. కరోనా బాధితుల ఆక్సిజన్ స్థాయిలను నిత్యం పర్యవేక్షించాలని.. ఆక్సిజన్ స్థాయిలు పడిపోతున్న వారిని వెంటనే ఆసుపత్రులకు తరలించాలని పేర్కొంది.