నక్సలైట్‌ ఏరియాల్లో CRPF‌ మహిళా కమాండోలు : అడవుల్లో అన్నల ఏరివేతకు అతివలు రె‘ఢీ’

నక్సలైట్‌ ఏరియాల్లో CRPF‌ మహిళా కమాండోలు : అడవుల్లో అన్నల ఏరివేతకు అతివలు రె‘ఢీ’

Updated On : February 6, 2021 / 6:13 PM IST

CRPF Women Commanods Duty Naxals Area : అడవుల్లో అన్నలు అంటే తుపాకులు పట్టుకుని కరడుకట్టిన గుండెలతో తూటాలతో ఆటలాడుకువాళ్లు. నక్సలైట్లు ఉండే ప్రాంతాల్లో డ్యూటీలు చేయాలంటే CRPF జవాన్లకు కత్తిమీద సామే. ఎటువైపునుంచి అన్నలు విరుచుకుపడతారో తెలీదు. అందుకే CRPF జవాన్లు ఎప్పుడూ అప్రమత్తంగా ఉంటారు. నక్సలైట్ ప్రభావిత ప్రాంతాలల్లో డ్యూటీలు చేయటమంటే మాటలు కాదు.

    అటువంటి అత్యంత ప్రమాదకర నక్సలైట్ల ఏరియాలో చరిత్రలో తొలిసారిగా మహిళా కమాండోలు డ్యూటీ చేయనున్నారు. నక్సలైట్ల ప్రాబల్య ప్రాంతంలో మహిళా భద్రతా దళాలు విధులు నిర్వహించేలా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అడవుల్లో శాంతి భద్రతల పరిరక్షణ కోసం సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌ (CRPF‌) మహిళా కమాండోలను పంపించాలని నిర్ణయించింది.

CRPF 88వ మహిళా బెటాలియన్‌ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా.. ప్రత్యేక శిక్షణ పొందిన మహిళా కమెండోలను నక్సలైట్ల ప్రభావిత ఏరియాల్లో డ్యూటీలకు పంపించాలనున్నామని సీఆర్‌పీఎఫ్‌ వెల్లడించింది. దీంతో ప్రపంచంలోనే మొట్టమొదటి మహిళా బెటాలియన్‌ ఏర్పాటుచేసిన ఘనత CRPFకే దక్కిందని ప్రకటించింది. ఇక CRPF మహిళా కమెండోలను నక్సలైట్ల ప్రాబల్య ప్రాంతాలకు పంపించి నక్సలైట్లను అరికడతామని ధీమా వ్యక్తం చేసింది CRPF.

CRPF మహిళా బెటాలియన్‌లోని 34 మంది మహిళలను కోబ్రా దళంలోకి ఎంపిక చేసి వారికి ప్రత్యేకంగా మూడు నెలల పాటు కమాండో ట్రైనింగ్ ఇస్తున్నామని CRPF డైరెక్టర్‌ జనరల్‌ ఏపీ మహేశ్వరి తెలిపారు. మహిళా బెటాలియన్‌లో పని చేస్తున్న పలువురు మహిళలకు అశోక్‌ చక్రతోపాటు పలు అవార్డులు దక్కాయని ఈ సందర్భంగా ఆమె తెలిపారు. విధి నిర్వహణలో భాగంగా CRPF దళం అత్యంత ధైర్య సాహసాలు కనబరుస్తోందనీ ఇదే సత్తాతో నక్సలైట్లను ఏరిపారేస్తామని ధీమా వ్యక్తం చేశారు.