Delhi : ఢిల్లీలో రూ.18 కోట్ల విలువైన హెరాయిన్‌ పట్టివేత..ఇద్దరు అరెస్ట్

దేశ రాజధాని ఢిల్లీలో గంజాయి స్మగ్లింగ్ మరోసారి కలకలం రేపింది. అత్యంత Rs.18 కోట్ల విలువైన హెరాయిన్ ను విక్రయిస్తున్న ఇద్దరిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.

Delhi : ఢిల్లీలో రూ.18 కోట్ల విలువైన హెరాయిన్‌ పట్టివేత..ఇద్దరు అరెస్ట్

Rs 18 Crore Worth Of Heroin

Updated On : November 3, 2021 / 1:28 PM IST

Two held with Rs 18 crore worth of heroin : దేశ రాజధాని ఢిల్లీలో గంజాయి స్మగ్లింగ్ మరోసారి కలకలం రేపింది. అత్యంత భారీ మొత్తంలో మత్తుమందు పట్టుబడింది. బుధవారం (నవంబర్ 3,2021) ఉదయం ఢిల్లీ పోలీస్‌కు చెందిన నార్కొటిక్స్‌ బృందం రాజధాని శివార్లలో హెరాయిన్‌ అమ్ముతున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 6 కిలోల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకుని సీజ్ చేశామని డీసీపీ బ్రిజేంద్ర కుమార్‌ యాదవ్‌ తెలిపారు.స్వాధీనం చేసుకున్న 6 కిలోల హెరాయిన్ విలువ సుమారు రూ.18 కోట్లు ఉంటుందని..నిందితులపై కేసు నమోదుచేశామని, హెరాయిన్‌ను ఎక్కడి నుంచి తీసుకొచ్చారనే విషయంపై వారిని విచారిస్తున్నామని తెలిపారు.

Read more : Ganja Crop : విశాఖ మన్యంలో గంజాయి తోటలు ధ్వంసం చేసిన పోలీసులు

నిందుతులు 19 ఏళ్ల అసిమ్, 28 ఏళ్ల వరుణ్ గా పోలీసులు గుర్తించారు. వీరిద్దరు గత సెప్టెంబర్ లో అరెస్ట్ అయిన డ్రగ్స్ కింగ్ పిన్ తైమూర్ ఖాన్ అలియాస్ భోలా అనుచరులు.ఢిల్లీ, ఆ చుట్టుపక్కల రాష్ట్రాల్లో పెద్ద మొత్తంలో భోలా, అతని అనుచరులు డ్రగ్స్ విక్రయిస్తుంటారు. డ్రగ్స్ తయారీలో కొత్త మార్గాలు ఎంచుకోవటంలో వీరు సిద్ధహస్తులు. ఓ ఇంట్లో హెరాయిన్ తయారు చేస్తుంటారు.

Read more : Rowdy Sheeter Ganja sales : హైదరాబాద్‌లో గంజాయి అమ్ముతున్న రౌడీ‌షీటర్ అరెస్ట్

దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు భోలాను అరెస్ట్ చేశారు. కానీ అతని అనుచరులు మాత్రం తప్పించుకోగా వారిలో ఇద్దరిని పోలీసులు ఇప్పుడు పట్టుకున్నట్లుగా తెలుస్తోంది. కాగా..తైమూర్ ఎంబీఏ చదివాడు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా నేరాల బాట పట్టి డ్రగ్స్ సరఫరా చేయడం ప్రారంభించాడని పోలీసుల విచారణలో వెల్లడైంది.