Mantralayam : మంత్రాలయం మఠంలో భక్తురాలు ఆత్మహత్యాయత్నం

ఏపీలోని కర్నూలు జిల్లాలోని మంత్రాలయం మఠంలో ఓ భక్తురాలు ఆత్మహత్యాయత్నం చేసింది. కర్ణాటక నుంచి వచ్చిన ఓ భక్తురాలు మంత్రాలయంలోని శ్రీ రాఘవేంద్రస్వామిని దర్శించుకోవటానికి వచ్చి మఠంలోనే ఆత్మహత్యకు యత్నించింది. ఈ క్రమంలో ఆమె మఠంలోనే నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించటం కలకలం రేపింది.

Mantralayam : మంత్రాలయం మఠంలో భక్తురాలు ఆత్మహత్యాయత్నం

Sri Raghavendra Swamy Math (1)

Updated On : August 10, 2021 / 12:08 PM IST

Devotee Attempted suicide at Mantralayam : ఏపీలోని కర్నూలు జిల్లాలోని మంత్రాలయం మఠంలో ఓ భక్తురాలు ఆత్మహత్యాయత్నం చేసింది. కర్ణాటక నుంచి వచ్చిన ఓ భక్తురాలు మంత్రాలయంలోని శ్రీ రాఘవేంద్రస్వామిని దర్శించుకోవటానికి వచ్చి మఠంలోనే ఆత్మహత్యకు యత్నించింది. ఈ క్రమంలో ఆమె మఠంలోనే నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించటం కలకలం రేపింది.ఇది గమనించిన మఠం నిర్వాహకులు ఆమెను వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు సమాచారం.

కాగా మంత్రాలయంలో శ్రీ రాఘవేంద్రస్వామిని దర్శించుకోవటానికి ఎంతోమంది భక్తులు వస్తుంటారు. కేవలం తెలుగు రాష్ట్రాల నుండ కాకుండా పలు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలి వచ్చి స్వామిని దర్శించుకుంటారు.ఈ క్రమంలో కర్ణాటక నుంచి వచ్చిన భక్తురాలు మరి ఆమెకు ఎటువంటి కష్టం వచ్చిందో ఏమోగానీ మఠంలోనే ఆత్మహత్యకు యత్నించిన ఘటన చోటుచేసుకుంది.

మంత్రాలయం అసలు పేరు ‘మాంచాలే’. మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర తీర్ధుల దేవాలయం. కలియుగంలో భూమిపై ధర్మాన్ని, నీతిని స్దాపించడానికి దైవసంకల్పాన జన్మించిన కారణజన్ముడు శ్రీ రాఘవేంద్ర స్వామి అని భక్తుల నమ్మకం.రాఘవేంద్ర స్వామి జీవిత చరిత్ర అసంఖ్యాకంగా ఉన్న స్వామి భక్తులకు ఎంతో ఉత్తేజాన్ని, భక్తి భావాన్ని కలుగజేస్తుంది. రాఘవేంద్ర స్వామి జీవిత చరిత్ర : పూర్వాశ్రమంలో రాఘవేంద్ర స్వామి అసలు పేరు వెంకటనాథుడు. ఆయన ఒక గృహస్తుడు. ఆయన భార్య పేరు సరస్వతి, కుమారుడు లక్ష్మీనారాయణ. ‘గురు సుధీంద్ర తీర్థ’ వెంకటనాధుని గురువు.

అత్యంత ప్రతిభావంతుడైన వెంకటనాధుని తన తదనంతరం పీఠం భాధ్యతలు స్వీకరించమని సుధీంద్ర తీర్ద ఆదేశించాడు. గురు స్దానాన్ని చేపట్టాలంటే గృహస్ద జీవితాన్ని వదులు కోవాలి. గృహస్ధు గా తన భాధ్యతలకు పూర్తి న్యాయం చెయ్యలేననే కారణంతో గురు ఆఙ్ఞను వెంకటనాధుడు వినయంగా తిరస్కరించారు. కానీ కాలక్రమంలో దైవ సంకల్పం వల్ల వెంకటనాధుడు సన్యాసాన్ని స్వీకరించి, పీఠం గురు స్దానాన్ని అలంకరించడం జరిగింది. అప్పడినుండి ఆయన గురు రాఘవేంద్రుడుగా ప్రసిద్దుడయ్యారు. ఆంధ్ర ప్రధేశ్ లోని కర్నూలు జిల్లాలో తుంగభద్రా నది ఒడ్డున మంత్రాలయం శ్రీ రాఘవేంద్రస్వామి మఠానికి ఎంతోమంది భక్తులు తరలి వచ్చి స్వామివారిని దర్శించుకుంటుంటారు.