Dhanush-Sekhar Kammula : తెలుగు క్లాస్ డైరెక్టర్ తో తమిళ్ స్టార్ హీరో సినిమా.. ఎట్టకేలకి మొదలు..

తాజాగా ధనుష్ మరో తెలుగు డైరెక్టర్ తో సినిమాని మొదలుపెట్టాడు. ధనుష్ హీరోగా తెలుగులో మంచి క్లాస్ సినిమాలు అందించే దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సినిమా గతంలోనే అనౌన్స్ చేశారు. ఇన్నాళ్లు ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరగగా నేడు ఈ సినిమా.............

Dhanush-Sekhar Kammula : తెలుగు క్లాస్ డైరెక్టర్ తో తమిళ్ స్టార్ హీరో సినిమా.. ఎట్టకేలకి మొదలు..

Dhanush and Sekhar Kammula movie started with pooja ceremony

Updated On : November 28, 2022 / 1:33 PM IST

Dhanush-Sekhar Kammula :  ఇటీవల తమిళ హీరోలంతా తెలుగులో, తెలుగు డైరెక్టర్స్ తో సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే విజయ్, శివ కార్తికేయన్, విష్ణు విశాల్, ధనుష్ ఇలా.. తమిళ్ హీరోలంతా తెలుగులో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటికే తమిళ్ స్టార్ హీరో ధనుష్ తెలుగులో డైరెక్టర్ వెంకీ అట్లూరితో ‘సర్’ సినిమా చేస్తున్నారు. షూటింగ్ పూర్తయిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటుంది.

తాజాగా ధనుష్ మరో తెలుగు డైరెక్టర్ తో సినిమాని మొదలుపెట్టాడు. ధనుష్ హీరోగా తెలుగులో మంచి క్లాస్ సినిమాలు అందించే దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సినిమా గతంలోనే అనౌన్స్ చేశారు. ఇన్నాళ్లు ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరగగా నేడు ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరిగాయి. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ LLP బ్యానర్ పై ఆసియన్ సునీల్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లనుంది.

Prabhas-Krithi Sanon : ప్రభాస్-కృతి సనన్ రిలేషన్ నిజమేనా..?? లీక్ చేసిన బాలీవుడ్ హీరో..??

క్లాస్ సినిమాలు తీసే శేఖర్ కమ్ముల ఎక్కువగా మాస్ సినిమాలు తీసే తమిళ్ స్టార్ ధనుష్ తో జతకట్టడంతో ఈ కాంబినేషన్ పై ఆసక్తి చూపిస్తున్నారు ప్రేక్షకులు. ఈ ఇద్దరూ కూడా హిట్స్ తో ఫుల్ ఫామ్ లో ఉన్నారు. బైలింగ్వల్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా తెలుగు, తమిళ్ ప్రేక్షకులని ఏ మేరకి మెప్పిస్తుందో చూడాలి.