Rajesh Touchriver : రేవతి ఆరోపణలు అవాస్తవం.. డైరెక్టర్ రాజేష్ టచ్ రివర్..
రీసెంట్‌గా రేవతి సంపత్ తనపై చేసిన ఆరోపణల గురించి రాజేష్ స్పందించారు

Director Rajesh Touchriver Reacts On Actress Revathy Sampath Allegations
Rajesh Touchriver: మలయాళ నటి రేవతి సంపత్ తనను కొందరు దక్షిణాది సినీ ప్రముఖులు వేదింపులకు గురిచేశారంటూ సోషల్ మీడియాలో చేసిన పోస్టులు వైరల్ అవుతున్నాయి. మొత్తం 14 మంది పేర్లు బయటపెట్టిందామె. వారిలో ‘నా బంగారు తల్లి’ వంటి సోషల్ ప్రాబ్లమ్ మీద సినిమా తీసి ప్రశంసలందుకున్న డైరెక్టర్ రాజేష్ టచ్ రివర్ పేరు కూడా ఉంది. రీసెంట్‌గా రేవతి సంపత్ తనపై చేసిన ఆరోపణల గురించి రాజేష్ స్పందించారు.
‘నా మీద మీడియాలో వస్తున్న కథనాలను చూసి ఆశ్చర్యపోయాను. ఈ ఆరోపణలకు స్పందించాల్సిన బాధ్యత నాపై ఉంది కాబట్టి స్పందిస్తున్నాను. నాపై ఆ యువతి నిరాధారమైన ఆరోపణలను చేస్తూ, ఏ చట్టపరమైన వేదికను ఆశ్రయించకుండా సులభ పద్ధతి అయిన సోషల్ మీడియాను వేదికగా ఎంచుకుంది. సోషల్ మీడియా ద్వారా ఎవరినైనా అపఖ్యాతి పాలు చేయడం సులభం. దానికి ఆధారాలు నిరూపించాల్సిన అవసరం లేదు. అందుకే దాన్ని వేదికగా తీసుకుంది.
నేను ప్రతి పాత్రికేయుడికి గౌరవం ఇస్తాను. పాత్రికేయ విలువలను గౌరవిస్తాను. అయినప్పటికీ పరువు నష్టం కలిగించే ఆధారాలు లేని ఒక ఫేస్‌బుక్ పోస్ట్‌ను ఆధారంగా తీసుకొని మీరు నా ఫోటోను ప్రచురిస్తూ, పరువు నష్టం కలిగించే వ్యాసాలలో నా పేరును ఉపసంహరించాలని అభ్యర్థిస్తున్నాను. భవిష్యత్తులో కూడా ఇలాంటి నిరాధారమైన వార్తల్లో కూడా నా పేరు ఊపయోగించకుండా ఉండాలని మీడియాను కోరుకుంటున్నాను’ అన్నారు రాజేష్ టచ్ రివర్.