Venkatesh : మెగా హీరోలతో కలిసి నటించిన వెంకీమామ.. ఎవరితో ఏ సినిమాలో తెలుసా?
వెంకటేష్ ఎక్కువ మల్టీస్టారర్ సినిమాలు మెగా ఫ్యామిలీతోనే ఉన్నాయి.(Venkatesh)
Venkatesh
- మన శంకర వరప్రసాద్ రిలీజ్
- మెగా హీరోలతో వెంకటేష్
- ఏ హీరోతో ఏ సినిమాలో
Venkatesh : ఈ జనరేషన్ లో మల్టీ స్టారర్ సినిమాలకు వెంటనే ఒప్పుకునే హీరోలలో వెంకటేష్ ముందుంటారు. వెంకటేష్ ఇప్పటికే చాలా మంది హీరోలతో కలిసి నటించారు. అయితే ఇందులో మెగా ఫ్యామిలీ ప్రత్యేకం. వెంకటేష్ కి మెగా ఫ్యామిలీకి మంచి అనుబంధం ఉంది. అందుకేనేమో వెంకటేష్ ఎక్కువ మల్టీస్టారర్ సినిమాలు మెగా ఫ్యామిలీతోనే ఉన్నాయి.(Venkatesh)
చిరంజీవి హీరోగా నేడు రిలీజ్ అయిన మన శంకర వరప్రసాద్ సినిమాలో వెంకటేష్ గెస్ట్ రోల్ చేసి మెప్పించారు. సినిమాలో ఆల్మోస్ట్ 20 నిముషాలు చిరంజీవితో కలిసి వెంకటేష్ సందడి చేసారు. చిరంజీవి – వెంకటేష్ హీరోలుగా ఫుల్ లెంగ్త్ సినిమా చేయడానికి కూడా రెడీ అన్నాడు.
Also Read : Vijay Deverakonda : విజయ్ దేవరకొండ సినిమా చూసి డిజప్పాయింట్ అయ్యాను.. బిగ్ బాస్ పృథ్వీ కామెంట్స్ వైరల్..
ఇక పవన్ కళ్యాణ్ తో అయితే గతంలో గోపాల గోపాల సినిమా చేసారు వెంకటేష్. ఆ సినిమాలో పవన్ దేవుడి పాత్రలో, వెంకటేష్ సాధారణ మనిషి పాత్రలో నటించారు. ఆ తర్వాత అజ్ఞాతవాసి సినిమా కోసం కూడా ఇద్దరూ కలిసి నటించారు కానీ ఎడిటింగ్ లో ఆ సీన్స్ తీసేసారు.
ఇక మరో మెగా బ్రదర్ నాగబాబుతో కలిసి కాంబినేషన్ సీన్స్ లేకపోయినా షాడో సినిమాలో నాగబాబు కొడుకుగా వెంకటేష్ నటించారు. పైగా ఆ సినిమాలో నాగబాబులా కనిపిస్తూ గెటప్ కూడా వేసుకున్నారు వెంకటేష్.
హీరో వరుణ్ తేజ్ తో అయితే F2, F3 సినిమాల్లో అదరగొట్టేసాడు వెంకటేష్. తోడల్లుడిగా వరుణ్ తేజ్ తో కలిసి నటించి నవ్వించారు.
Also Read : Mana ShankaraVaraPrasad Garu : ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఏ ఓటీటీలోకి వస్తుందో తెలుసా? ఎప్పుడు వస్తుంది..?
రామ్ చరణ్ తేజ్ తో హిందీ సినిమా కిసి కా భాయ్ కిసి కా జాన్ సల్మాన్ ఖాన్ సినిమాలో ఓ సాంగ్ లో డ్యాన్స్ వేసి మెప్పించారు. ఈ డ్యాన్స్ లో చరణ్, వెంకటేష్ కలిసి సల్మాన్ ఖాన్ తో కలిసి స్టెప్పులేశారు.
అలా వెంకటేష్ ఆల్మోస్ట్ మెగా హీరోలందరితో కలిసి నటించారు. మరి ఫ్యూచర్ లో సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ తో కూడా కలిసి నటిస్తారేమో చూడాలి.
