డ్రైవింగ్‌లో ఈ బేసిక్ రూల్స్ తప్పక తెలుసుకోవాల్సిందే!

ట్రాఫిక్ రూల్స్… కేవలం వాహనదారులే కాదు.. రోడ్డుపై వెళ్లే పాదాచారులు కూడా తప్పక పాటించాలి. ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన ఉండి ఉండాలి. ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన లేకపోవడం కారణంగానే చాలాసార్లు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ట్రాఫిక్ రూల్స్ గురించి 10 ప్రశ్నలకు మీకోసం అందిస్తున్నాం. మీ సొంతంగా వాటి సమాధానాలను చెప్పేందుకు ప్రయత్నించండి.
ఆ తర్వాత కింది ఇచ్చిన సరైన సమాధానాలతో మీ సమాధానాలను పోల్చి చూసుకోండి. ఇందులో దాదాపు మీకు తెలిసినవే ఉంటాయి. కానీ, ఒకసారి వాటిని చదవిన తర్వాత మీకు ఎలాంటి హని ఉండదు. ఈ లాక్ డౌన్ సమయంలో కొన్ని ట్రాఫిక్ రూల్స్, రెగ్యులేషన్స్ ఏంటో నేర్చుకునే ప్రయత్నం చేద్దాం..
1. ప్రైవేటు వాహనానికి జారీ చేసే డ్రైవింగ్ లైసెన్స్ వ్యాలిడిటీ పిరియడ్ ఏంటి?
20ఏళ్లు లేదా వాహనదారుడికి 50ఏళ్లు వచ్చేంతవరకు డ్రైవింగ్ లైసెన్స్ వ్యాలిడిటీ ఉంటుంది.
2. జంక్షన్ చేరుకునే సమయంలో డ్రైవర్ తప్పక గమనించాల్సిన రూల్స్ ఏంటి?
వేగాన్ని తగ్గించాలి. మీ కుడివైపు నుంచి వెళ్లే వాహనాలకు దారి ఇవ్వాలి. ముందు రోడ్డు క్లియర్ అయ్యాక మాత్రమే మెయిన్ రోడ్డులోకి ఎంటర్ అవ్వాలి.
3. పక్క రోడ్డు నుంచి మెయిన్ రోడ్డులోకి ఎంటర్ అయ్యే ముందు డ్రైవర్ తప్పక పాటించాల్సిన రూల్స్ ఏంటి?
వేగాన్ని తగ్గించాలి. కుడివైపు వాహనాలకు దారి ఇవ్వాలి. ముందు వెళ్లే వాహనాలు క్లియర్ అయ్యాక మెయిన్ రోడ్డులోకి ఎంటర్ అవ్వాలి.
4. వాహనాన్ని కొండపై నుంచి కిందికి నడిపే సమయంలో ఏ గేర్ లో ఉంచి నడపాలి?
కొండపైకి వెళ్లే సమయంలో ఏ గేర్ వాడారో అదే గేర్ కొనసాగించాలి.
5. కొండపై కుడివైపు మార్గంలో ఎవరు వెళ్లాలి?
కొండపైకి వెళ్లే ట్రాఫిక్ కుడివైపు భాగంలో వెళ్లాలి.
6. PUC సర్టిఫికేట్ వ్యాలిడిటీ పిరియడ్ ఏంటి?
6. ఆరు నెలలు (BS6 వాహనాలకు ఈ రోజుల్లో ఏడాది వరకు PUC సర్టిఫికేట్ పనిచేస్తుంది)
7. లెర్నర్ లైసెన్స్ ఉన్నప్పుడు ఎలాంటి రూల్స్ ఫాలో అవ్వాలి?
లెర్నర్ లైసెన్స్ తర్వాత పొందే వ్యాలీడ్ డ్రైవింగ్ లైసెన్స్ తో రోడ్లపై వాహనాన్ని నడపొచ్చు. ‘L’ స్టిక్కర్/బోర్డును వాహనం ముందు వెనుక భాగంలో అతికించాలి. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే రోడ్లపై నడపాలి.
8. వాహనం ప్రమాదానికి గురైతే ఇన్సూరెన్స్ కంపెనీకి ఇవ్వాల్సిన కీలక సమాచారం ఏంటి?
ప్రమాదం జరిగినప్పుడు ఇన్సూరెన్స్ పాలసీ నెంబర్, ఎక్స్ పెయిరీ డేట్, తేదీ సమయం, స్థలం వివరాలు, ఎవరైనా చనిపోతే అప్పుడు ఆ డ్రైవర్ పేరు, అడ్రస్, లైసెన్స్ వివరాలను తప్పకుండా పాలసీ కంపెనీకి సమర్పించాలి.
9. లెర్నర్ లైసెన్స్ ఇచ్చిన తర్వాత డ్రైవింగ్ టెస్టు తీసుకోవడానికి ఎంత సమయం పడుతుంది?
ఒక నెలపాటు ఉంటుంది.
10. లైట్ మోటార్ వెహికల్ అంటే ఏంటి? లైట్ వెయిట్ మోటార్ వెహికల్స్ కిందకు అన్ని వాహనాలు వస్తాయా?
కార్లు, పికప్ వ్యాన్లు, జీపులు, ఒమిని టైప్ వాహనాల్లో 7,500 కిలోల కంటే తక్కువ బరువు ఉండేలా చూసుకోవాలి.
Read: మిడుతల దండుతో ఎంత నష్టం ఉండొచ్చు.. ఈ 10 పాయింట్లు తప్పక తెలుసుకోండి