Enforcement Directorate: హైదరాబాద్ సహా దేశంలోని 44 ప్రాంతాల్లో చైనా స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థలపై ఈడీ దాడులు
హైదరాబాద్, బంజారాహిల్స్‌లోని ఒప్పో సంస్థ కార్యాలయంలోనూ సోదాలు జరుగుతున్నాయి. నగదు అక్రమ చలామణీ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) నిబంధనల ఉల్లంఘనలపై ఈ సోదాలు కొనసాగుతున్నాయి.

Vivo Mobile Shop
Enforcement Directorate: హైదరాబాద్ సహా దేశంలోని 44 ప్రాంతాల్లో చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థల ప్రధాన కార్యాలయాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు జరుపుతోంది. హైదరాబాద్, బంజారాహిల్స్‌లోని ఒప్పో సంస్థ కార్యాలయంలోనూ సోదాలు జరుగుతున్నాయి. నగదు అక్రమ చలామణీ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) నిబంధనల ఉల్లంఘనలపై ఈ సోదాలు కొనసాగుతున్నాయి.
Telangana: నేడు, రేపు భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం
చైనా మొబైల్ కంపెనీలు వివో, ఒప్పోతో ప్రత్యక్ష పరోక్ష సంబంధాలు ఉన్న సంస్థల్లోనూ సోదాలు జరుగుతున్నాయి. గతంలో ఫెమా నిబంధనల ఉల్లంఘన కింద షియోమికి చెందిన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. ఏడాది కాలంగా లావాదేవీలు, సర్వర్, నెట్వర్క్‌పై ఈడీ దర్యాప్తు జరుపుతోంది. కొంత కాలంగా చైనా మొబైల్ ఫోన్ కంపెనీలపై ఐటీ, ఈడీలు నిఘా పెట్టాయి.