NCERT Report : ఈస్ట్ ఆర్ వెస్ట్..English is the బెస్ట్

ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు..మీడియంలో చదువు చెబుతారా ? అనే ఉత్కంఠ ఇంకా కంటిన్యూ అవుతోంది. హైకోర్టు దీనిపై కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అసలు ఇంగ్లీషు మీడియంలో బోధించాలా వద్ద ? అభిప్రాయాలు చెప్పాలని తల్లిదండ్రుల నుంచి..లిఖితపూర్వక ఆప్షన్లను సేకరించారు అధికారులు. 96.17 శాతం మంది ఇంగ్లీషు మీడియానికి జై కొట్టారు. ఈ క్రమంలో…ఇంగ్లీషు మీడియాన్ని ప్రవేశపెట్టేందుకు వీలుగా సిఫార్సులతో కూడిన నివేదిక ఇవ్వాలని NCERT ఆదేశిస్తూ…ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో సమగ్ర నివేదిక రూపొందించి..ప్రభుత్వానికి సమర్పించినట్లు తెలుస్తోంది.
నివేదికలో : –
1 నుంచి 10వ తరగతి వరకు ఇంగ్లీషు మీడియాన్ని దశల వారీగా ప్రవేశపెట్టాలి. 1 నుంచి 6వ తరగతి వరకు…ఇంగ్లీషు మీడియం…పాఠ్య పుస్తకాలను అభివృద్ధి చేయించాలి. తల్లిదండ్రులతో ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహించి..విద్యార్థులు ఎలా చదువుతున్నారో దానిపై చర్చించాలి. విద్యార్థుల ఆప్షన్లకు అనుగుణంగా ఇంగ్లీషు మీడియం తరగతులు సమాంతరంగా కొనసాగించవచ్చు.
విద్యార్థుల్లో ఒత్తిడి, భయం, ఆందోళన లేకుండా వారి వారి భావాలను స్వేచ్ఛగా.. తడబాటుకు తావు లేకుండా చెప్పగలగాలి. ఎల్లప్పుడూ పర్యవేక్షించటం ద్వారా వారిలో సామర్థ్యాలు ఏ మేరకు పెరుగుతున్నాయో కూడా తెలుసుకోవచ్చు. విషయ పరిజ్ఞానం, నైపుణ్యాలు, ప్రమాణాలు అభివృద్ధి చెందుతాయి. వర్క్ బుక్స్, స్కూల్ కిట్స్, అభివృద్ధిపర్చిన పాఠ్య పుస్తకాలు, పౌష్టికతతో కూడిన మధ్యాహ్న భోజనం వంటివి దీనికి మరింత తోడ్పాటునిస్తాయి.
Read More:
* విశాఖ గ్యాస్ లీక్ : మహిళల ఖాతాల్లోనే..ప్రతి కుటుంబానికి రూ. 10 వేలు