‘నేషనల్ క్రష్ నిధి’.. గుడి కట్టిన ఫ్యాన్స్..

‘నేషనల్ క్రష్ నిధి’.. గుడి కట్టిన ఫ్యాన్స్..

Updated On : February 16, 2021 / 4:32 PM IST

Nidhhi Agerwal: సినిమా అభిమానులందరిలోనూ తమిళ తంబీల అభిమానం వేరని చెప్పాలి. తాజాగా హాట్ బ్యూటీ నిధి అగర్వాల్‌‌కి కొందరు తమిళ్ ఫ్యాన్స్ గుడి కట్టారు. గుడి కట్టడంతో పాటు, ఆమె విగ్రహానికి పాలాభిషేకం చేసి, హారతిచ్చారు. ‘సవ్యసాచి’, ‘ మిస్టర్ మజ్ను’, ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాలతో టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చకుంది నిధి.

Nidhi Agarwal

కోలీవుడ్‌లో రెండంటే రెండే సినిమాలు చేసింది. జయం రవితో నటించిన ‘భూమి’ ఇటీవలే ఓటీటీలో విడుదలైంది. శింబుతో చేసిన ‘ఈశ్వరన్’ సంక్రాంతికి థియేటర్లలో రిలీజ్ అయింది. తమిళనాట మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకోడమే కాక గుడి కట్టే అంతటి అభిమానాన్ని దక్కించుకుంది.

Nidhi Agarwal

తమిళనాడులో ఎంజీఆర్, ఖుష్బూ, నమిత, హన్సికల తర్వాత గుడి కట్టిన నటి నిధినే కావడం విశేషం. ఇక ఇందుకు సంబంధించిన ఫొటోలను ఫ్యాన్స్ ‘నేషనల్ క్రష్ నిధి’ పేరుతో సోషల్ మీడియాలో షేర్ చెయ్యగా వాటిని చూసి నిధి ఆశ్చర్యానికి గురైంది. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – క్రిష్ కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమాలో కథానాయికగా నటించే సూపర్ ఛాన్స్ కొట్టేసింది నిధి అగర్వాల్.

Nidhi Agarwal