నెలల తరబడి పోరాడి తల్లిని బ్రోతల్ హౌజ్ నుంచి విడిపించిన కొడుకు
కన్న తల్లి కోసం నెలల తరబడి పోరాడి ఎట్టకేలకు బ్రోతల్ హౌజ్ నుంచి బయటకు తీసుకొచ్చాడు గౌరవ్. ఆ చీకటి జీవితం నుంచి బయల్దేరి శనివారం పూణె రైల్వే స్టేషన్లో ట్రైన్ ఎక్కింది ఆ మహిళ. ఈ కథ మొత్తం 2019పూణె వ్యభిచారం రాకెట్లో

Brothel House: కన్న తల్లి కోసం నెలల తరబడి పోరాడి ఎట్టకేలకు బ్రోతల్ హౌజ్ నుంచి బయటకు తీసుకొచ్చాడు గౌరవ్. ఆ చీకటి జీవితం నుంచి బయల్దేరి శనివారం పూణె రైల్వే స్టేషన్లో ట్రైన్ ఎక్కింది ఆ మహిళ. ఈ కథ మొత్తం 2019పూణె వ్యభిచారం రాకెట్లో మొదలైంది.
బాధితురాలు కొడుకు మాట్లాడుతూ.. తన తల్లి కోల్‌కతాలో ఇంటి పనులు చేసుకునేదని చెప్పాడు. తనకు ఇంకా మంచి ఉద్యోగం ఇస్తానంటూ ఓ వ్యక్తి పూణెకు తీసుకొచ్చాడు. ఆ తర్వాత బలవంతంగా బుధ్వార్ పేట్ లోని రెడ్ లైట్ ఏరియాలోని వ్యభిచారం రాకెట్లోకి దింపేశారు.
సినీ ఫక్కీలో ఆ రెడ్ లైట్ ఏరియాకు వచ్చిన ఓ వ్యక్తి నుంచి తల్లి తన కుటుంబానికి ఫోన్ చేసిందట. ‘బ్రోతల్ హౌజ్ కు వెళ్లి వచ్చిన వ్యక్తి మా అమ్మ ఉండే లొకేషన్ గురించి చెప్పాడు. అప్పుడే పూణె సిటీ పోలీసులను సహాయం కోసం సంప్రదించాం. వెస్ట్ బెంగాల్, పూణెలో ఉండే సోషల్ యాక్టివిస్ట్ ల సహకారంతో చేరుకోగలిగాం’
ఇన్‌స్పెక్టర్ వైశాలి చాంద్ గుడ్ ఆధ్వర్యంలో పూణె సిటీ పోలీస్ క్రైమ్ బ్రాంచ్ రైడ్ జరిపారు. 2020 సెప్టెంబర్ 18న జరిపిన దాడిలో ఇద్దరు మహిళలను కాపాడారు. అందులో గౌరవ్ తల్లి కూడా ఒకరు. దానిని నిర్వహిస్తున్న ఇద్దరు మహిళలను.. వారితో సంబంధం ఉన్న వారితో కలిపి నలుగురిపై కేస్ బుక్ చేశారు.
ఆ తర్వాత గౌరవ్ తల్లిని పూణెలోని గవర్నమెంట్ అబ్జర్వేషన్ హోంలో ఉంచారు. తల్లిని తీసుకెళ్లడానికి నవంబరులోనే పూణెకు వచ్చా. యాక్టివిస్టులు జయవంత్ గంధలె, రాహుల్ బాంగొండె, సంజయ్ పరలీకర్, దినేశ్ జాదవ్, హేమాద్రి కుందు లీగల్ ఫార్మాలిటీస్ అంతా పూర్తయ్యేలా ఏర్పాట్లు చేశారు.
పుష్కర్ దుర్కె, తేజ్‌లక్ష్మీ ధోపాకర్ లాయర్ల సహకారంతో కోర్టు మెట్లెక్కాడు. లీగల్ ప్రోసెస్ పూర్తి చేసుకుని మార్చి 2న జ్యూడిషియల్ మెజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ ఆర్కే బాఫనా బాధితురాలి బాధ్యతను ఆమె కొడుక్కు అప్పజెప్పమంటూ ఆర్డర్ ఇచ్చారు. దాంతో పాటు ట్రయల్స్ మొదలైనప్పటి నుంచి కోర్టు పిలిచినప్పుడు తప్పక హాజరుకావాలంటూ ఆర్డర్ వేశారు.
ఎట్టకేలకు మా అమ్మను తీసుకుని ఇంటికి వెళ్లగలుగుతున్నా. అని కొడుకు చెప్తుంటే.. నా జీవితంలో ఇదొక చేదు ఘట్టం. ఆ మోసగాళ్లను కోర్టు శిక్షించాలంటూ మహిళ వాపోయింది. భర్త చనిపోవడంతో కొడుకు మాత్రమే సంపాదన కోసం కోల్‌కతాలో పనిచేసుకుంటున్నాడని మహిళ చెప్పింది.