మీ పేరు మీద ఎన్ని నంబర్లు ఉన్నాయో తెలుసుకోండి

మీ పేరు మీద ఎన్ని నంబర్లు ఉన్నాయో తెలుసుకోండి

Find Out How Many Numbers Are In Your Name

Updated On : April 20, 2021 / 11:58 AM IST

మనకు తెలిసో.. తెలియకుండానో మన పేరు మీద ఎన్ని ఫోన్ నంబర్లు ఉన్నాయో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అటువంటి అవకాశం ఉంది.. దీనికి సంబంధించిన వెబ్‌సైట్‌ను విజయవాడ టెలికాం విభాగం(డీవోటీ) రూపొందించి సోమవారం ప్రారంభించింది.

http://tafcop.dgtelecom.gov.in అనే వెబ్‌సైట్‌లో మొబైల్‌ నంబరు.. దానికి వచ్చే ఓటీపీ నమోదు చేయగానే మన పేరుమీద ఉన్న ఫోన్‌ నంబర్ల వివరాలన్నీ వస్తాయి. వాటిలో మనకు అవసరం లేనివి, మనకు తెలియకుండా మన పేరుమీద ఉన్న వాటిని సెలక్ట్‌ చేసి సబ్మిట్‌ చేస్తే.. టెలికం శాఖ చర్యలు తీసుకుంటుంది.

ఒకరి పేరు మీద అత్యధికంగా 9 నంబర్లు ఉండేందుకు వీలుంది. కొందరి పేర్ల మీద అంతకంటే ఎక్కువ నంబర్లు ఉన్నట్లుగా టెలికాం శాఖ గుర్తించింది. ముందుగా తెలుగు రాష్ట్రాల టెలికం సర్కిళ్లలో ఈ సదుపాయాన్ని ప్రారంభించగా.. త్వరలో దేశవ్యాప్తంగా అందుబాటులోనికి వస్తుందని టెలికాం శాఖ అధికారులు వెల్లడించారు. ఎవరికైనా అనుమానం ఉంటే.. వెంటనే చెక్ చేసుకోవచ్చు.